వరంగల్

జనగాంకు నీరిచ్చింది కాంగ్రెస్సే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, సెప్టెంబర్ 20: అత్యంత ఎతె్తైన జనగామ ప్రాంతానికి సాగు, త్రాగు నీరు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని, అది తామే చేశామని ప్రకటించుకునే టీఆర్‌ఎస్ నాయకులను ప్రజలు నమ్మరని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గురువారం జనగామలోని పలు గ్రామాల్లో పర్యటించి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా స్థానిక 1వ వార్డుకు చెందిన సుమారు 80మంది యువకులు మంద వెంకటనర్సయ్య నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికిపొన్నాల లక్ష్మయ్య పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనేక కష్టనష్టాలను అధిగమించి జనగామ ప్రాంతానికి దేవాదుల ద్వారా గోదావరి నీరు తెస్తే తామే తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంతో పాటు వ్యవసాయ ఆధారిత పాడి పరిశ్రమలను అభివృద్ధి చేసి రైతులను ఆదుకున్నామని అన్నారు. పాడి రైతులకు అనేక రాయితీలు కల్పిస్తూ వారిని ఆర్థికంగా ముందుకు తీసుకుపోయామని అన్నారు. చిటకోడూర్ రిజర్వాయర్ ద్వారా జనగామ పట్టణ ప్రజలకు ప్రతీరోజు త్రాగునీరు సరఫరా చేస్తే, ప్రస్తుతం రెండు రోజులకు ఓసారి నీరు సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి ప్రజలకు ద్రోహం చేశారని విమర్శించారు. అర్హులైన పేదలందరికీ డబుల్‌బెడ్‌రూంలు నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీ ఏమయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి 55లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదలకు నివాస సౌకర్యం కల్పించామని అన్నారు. అదే విధంగా దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని విఫలమయ్యారని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో 66లక్షల ఎకరాల భూమిని పంచి వారికి కావాల్సిన సధుపాయాలు కల్పించామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైన టీఆర్‌ఎస్‌కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ప్రజాస్వామ్య ముసుగులో ప్రజాధనాన్నంతా దుర్వినియోగం చేశారని విమర్శించారు. కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దివాలా తీశారని అన్నారు. ఏ సమయంలో ఏ విధంగా బుద్ది చెప్పాలో ప్రజలకు తెలుసునని అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆధరించి అధికారంలోకి తీసుకువచ్చి తెలంగాణలో గత వైభవాన్ని తీసుకువస్తామని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్‌ఛార్జీ చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొత్త కర్ణాకర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నర్సింగరాజు, మున్సిపల్ ప్లోర్ లీడర్ అన్వర్, పార్టీ అధికార ప్రతినిథి రంగరాజు ప్రవీణ్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డిలు పాల్గొన్నారు.

డబుల్ ఇళ్ల పనులు పూర్తిచేయండి: ఈటెల
కమలాపూర్, సెప్టెంబర్ 20: మండల కేంద్రమైన కమలాపూర్‌లోని సబ్ స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను మంత్రి ఈటెల రాజేందర్, వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి దీపావలి వరకు పూర్తి చేసి గృహప్రవేశాలకు అందివ్వాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుక, ఇబ్బందులు లేకుండా అందించాలని, నిర్మిణాలకు అవసరమయిన ఇసుక ఇబ్బందులు లేకుండా అందించాలని అన్నారు. వెంటనే విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని, నీళ్లు తదితర సదుపాయాల అందించాలని కలెక్టర్‌ను మంత్రి ఈటెల ఆదేశించారు. మండలంలో 19వేల రైతులు ఉండగాఅందులో 10వేల మందికి రైతు బందు చెక్కులు అందించారు. మిగిలిన వారందరికి వారంలోపు సరిచేసి పెండింగ్‌లో ఉన్న చెక్‌లను అందిస్తామన్నారు. అలాగే మర్రిపెల్లి గూడెం, గూడూరు, కమలాపూర్‌లోని నిరుపేదలకు గతంలో ఇండ్ల పట్టాలు ఇచ్చాం. కాని వాటిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కావున తొందరలోనే సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ను మంత్రి కోరారు. కలెక్టర్‌ను వారినికొకసారి కమలాపూర్ మండలానికి వచ్చి సమస్యలపై దృష్టి సారించాలని మంత్రి పేర్కోన్నారు.

కార్పోరేషన్ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
* ఎస్సీ కార్పోరేషన్ జీఎం ఆనందకుమార్
ఏటూరునాగారం, సెప్టెంబర్ 20: ప్రభుత్వం ఎస్సీ కార్పోరేషన్ ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పోరేషన్ జనరల్ మేనేజర్ ఆనందకుమార్ అన్నారు. గురువారం కన్నాయిగూడెం మండలంలో ఎస్సీ కార్పోరేషన్ ద్వారా మంజూరైన గుడుంబా, ఈఎస్‌ఎస్ స్కీం లబ్దిదారుల యూనిట్లను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 2014నుండి 2018 వరకు 3508 యూనిట్లకు గాను రూ.3796.31లక్షల మంజూరు అయ్యాయన్నారు. భూమి కొనుగోలు స్కీం ద్వారా 2014నుండి 2018 వరకు 199మంది లబ్ది దారులకు 572.26 ఎకరాలకుగాను రూ.2790.02లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి మెహరున్నీసా, జడ్పిటిసి వలియాబీ, ఎంపిడిఒ ప్రవీణ్‌కుమార్, ఎంపిటిసిలు, సిబ్బంది పాల్గొన్నారు.

23మంది ఎస్సైల బదిలీ
* ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్
వరంగల్ క్రైం, సెప్టెంబర్ 20: వరంగల్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని 23మంది ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ రవీందర్ గురువారం ఉత్తర్వులు జారీ చేసారు. బదిలీ అయిన వారిలో ఎస్.దీపక్ సంగెం నుండి వర్ధన్నపేట, పి.ఉపేందర్‌రావు వర్ధన్నపేట నుండి సిఎస్‌బి వరంగల్, ఎం.నాగరాజు సిఎస్‌బి నుండి సంగెం, ఎస్.విఠల్ గీసుగొండ నుండి కెయూసి, పి.రంజిత్‌రావు రాఘనాద్‌పల్లి నుండి బచ్చన్నపేట, ఎం.్భరత్ బచ్చన్నపేట నుండి తరిగొప్పుల, ఎస్.వేణుగోపాల్ లింగాల ఘన్‌పూర్ నుండి రఘనాధపల్లి, బి.రాజేష్ తరిగొప్పుల నుండి సిసిఆర్‌బి వరంగల్, ఎస్.రవీందర్ సి ఎస్‌బి వరంగల్ నుండి లింగాల ఘన్‌పూర్, ఎ.ప్రవీణ్‌కుమార్ కెయూసి నుండి మట్టవాడ ఆటాచ్డ్ ఇంతేజార్ గంజ్, ఇ.హరికృష్ణ నల్లబెల్లి నుండి కెయూసి, ఒ.నరేందర్‌రెడ్డి దేవరుప్పుల నుండి నల్లబెల్లి, సిహెచ్.రవికుమార్ మామునూర్ నుండి దేవరుప్పుల, ఇ.్భమేష్ కెయూసి నుండి మిల్స్‌కాలనీ, జి.సతీష్ సుబేదారి నుండి పాలకూర్తి, ఎన్.వెంకటేశ్వర్లు పాలకూర్తి నుండి విఆర్ వరంగల్, ఎం.రాజు సిసి ఎస్ వరంగల్ నుండి కొడకండ్ల, వై.సత్యనారాయణ కొడకండ్ల నుండి సుబేదారి, ఎం.శివకుమార్ వీఆర్ వరంగల్‌కు బదిలీ అయ్యారు. ఇ.శ్రీనివాస్ హన్మకొండ నుండి చెల్పూర్, డి.గురుస్వామి సిటిసి వరంగల్ అటాచ్డ్ టు చెల్పూర్ నుండి తిరిగి సిటిసికి, బొద్దుల రవీందర్ ఆత్మకూర్ నుండి మిల్స్ కాలనీకి, వై సతీష్ సిసిఆర్‌బి నుండి ఆత్మకూర్‌కు, యు.బాస్కర్ రెడ్డి దుగ్గొండి నుండి దామెరకు, ఎం.సాంబమూర్తి కాజీపేట నుండి దుగ్గొండికి, కొత్తపల్లి అశోక్ కుమార్ సిసిఆర్‌బి వరంగల్ నుండి కాజీపేటకు, జె.మోహన్‌బాబు దామెర పోలీసు స్టేషన్ నుండి వీఆర్ వరంగల్‌కు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేసారు.