వరంగల్

విద్యతోనే ప్రయోజకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, సెప్టెంబర్ 22: దళితులలో వెలుగు నింపే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ కార్పోరేషన్ ద్వారా పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ది పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. నర్సంపేటలోని రెడ్డి కళ్యాణ మండపంలో దళిత యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, ఉపాధి కల్పనలపై శనివారం సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన అవగాహాన సదస్సు జరిగింది. ఈసదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని 67 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు దళితుల సంక్షేమం కోసం ఏనాడు పాటుపడలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నత కోసం ముఖ్యమంత్రి కేసీ ఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని చెప్పారు. విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించే దళిత విద్యార్థులకు ఇరవై లక్షల రూపాయల స్కాలర్ షిప్‌లను సైతం ఇస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నా ఇంకా దళితులు వెనుకబడి ఉన్నారని, అంటరానితనంతో పాటు సమాజంలో చులకన అనే భావం ఉందని వాపోయారు. ఇలాంటి తరుణంలో దళితులు తమ పిల్లలను ఉన్నత విద్య చదివించాలని, విద్యతోనే ప్రయోజకులు అవుతారని స్పష్టం చేశారు. సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ కార్పోరేషన్ నర్సంపేట నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా గుర్తించడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 16 వందల మంది దళిత రైతులకు 16వందల పాడిగేదెల యూనట్లు మంజూరు చేయాలని ఎస్సీ కార్పోరేషన్ ఎండీ లచ్చిరాంనాయక్‌ను కోరారు. పది రోజులలో దళితులకు మంజూరు చేసిన యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈసదస్సులో 253 మంది బీసీలకు నూరు శాతం సబ్సీడికి కింద మంజూరు అయిన యాబైవేల రూపాయల ఆర్ధిక సహాయం చెక్కులను ఎంపీ సీతారాంనాయక్, సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డిలు అందజేశారు. ఈకార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ ఇడీ సురేష్, టీఆర్‌ఎస్ నాయకులు మునిగాల వెంకట్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, మోతె జయపాల్‌రెడ్డి, ఎంపీపీలు గటిక అజయ్‌కుమార్, బాదావతు భద్రమ్మ, కుంచారపు వెంకట్‌రెడ్డి, ఎండీ.నబీ, గూడూరు జడ్పీటీసీ మహ్మద్ ఖాసీం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మళ్ళీ గెలిపిస్తే మరింత అభివృద్ధి..
* ఎన్నికల ప్రచారంలో పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రావు హామీ
జనగామ టౌన్, సెప్టెంబర్ 22: పాలకుర్తి ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపిస్తే నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నా రు. దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో శనివారం బూత్‌స్థాయి కన్వినర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసి ఆర్ సహాకారంతో జిల్లాలోని నియోజకవర్గాలన్నింటిలో పాలకుర్తిని కొంతవర కు అభివృద్ధి చేశానని అన్నారు. అదే విధంగా త్వరలో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. పార్టీ నాయకులు, ప్రధానంగా బూత్ స్థాయి కన్వినర్లు ప్రణాళిక ప్రకారం కృషి చేసి ఓటర్లను టీఆర్‌ఎస్‌కు ఓటు వేసే విధంగా చూసుకోవాలని కోరారు. అనంతరం గ్రామంలోని దొడ్డి కొంరయ్య స్థూపానికి పుష్పాలు చల్లి నివాళ్లర్పించారు. తదనంతరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి వినాయకుల మండపాల వద్ద పూజలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిథి ఆంజనేయులు, వృక్కోదర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, దయాకర్, సోమయ్య, పద్మ, రమాదేవి, రత్నారెడ్డి, లీనారెడ్డి, జలేందర్‌రెడ్డి, సాయిలు పాల్గొన్నారు.

అన్నదాతల అభివృద్ధే ధ్యేయం
దసరాకు రూ.3 కోట్ల 50 లక్షల బోనస్: బ్యాంకు అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 22: ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాం కు అన్నదాతలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ధ్యేయమని ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాం కు అధ్యక్షులు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేర్కొన్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సహకార బ్యాంకు 62 వార్షికోత్సవ మహాసభ శనివారం పారాబాయిల్డ్ రైస్‌మిల్లులో జరిగింది. మహాసభలో ముందుగా దివంగత బ్యాంకు అధ్యక్షులు అల్గిరెడ్డి కాశీవిశ్వనాధరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వార్షిక నివేదికను లోన్స్ మేనేజర్ రాజమొగిలి సంఘ సభ్యులకు చదివి వినిపించారు. అనంతరం జరిగిన మహాసభలో ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ బ్యాంకు ఈసంవత్సకం 300 కోట్లు వ్యాపారం చేసి ఆరుకోట్ల నికరలాభం ఆర్జించిందన్నారు. రైతులకు పంట అప్పు గతంలో 30 వేలు ఉండగా 37 వేలకు పెంచడం జరిగిందన్నారు. రైతు చనిపోతే గతంలో కంటే నేడు 10 వేలు నగదు, ఒక క్వింటా సన్నబియ్యం ఇవ్వనున్నట్లు సభా ముఖంగా వెల్లడించారు. రైతులకు బోనస్ 3 కోట్ల 50 లక్షల రూపాయలు దసరాకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక కోటీ రూపాయలతో ముస్త్ఫాపూర్ గ్రామంలో గోదామ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. బ్యాంకు రైతులకు 190 మందికి కంటి పరీక్షలు నిర్వహిం చి ఆపరేషన్లు చేయించి రూ.10 లక్షలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు రూ.70 లక్షలు ప్రోత్సాహకంగా అందించడం జరుగుతుందన్నారు. సమావేశంలో ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాం కు జనరల్ మేనేజర్ మార్పాటి రాంరెడ్డి, ఏజీ ఎం వెంకటేశ్వర్‌రావు, డెయిరీ అధ్యక్షురాలు విజయ, బ్యాంకు ఉపాధ్యక్షులు సుభాష్‌తో పాటు ఏడువేల మంది రైతులు పాల్గొన్నారు.