వరంగల్

ఓటర్ నమోదును పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, సెప్టెంబర్ 22: ఇప్పటివరకు ఓటరు జాబితాలో లేని వారందరినీ జాబితాలో చేర్పించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని ఎన్నికల పరిశీలకులు దివాకర్‌బాబు కోరారు. జనగామ జిల్లాలో నిర్వహిస్తున్న ఓటర్‌నమోదు కార్యక్రమాన్ని ఎన్నికల పరిశీలకులు ఐఏఎస్ అధికారి దివాకర్‌బాబు శనివారం పరిశీలించారు. జిల్లాకు వచ్చిన ఆయనను స్థానిక కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి స్వాగతం పలికారు. కొంత సమయం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఓటరు నమోదు ప్రక్రి య ఎంతవరకు పూర్తయిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జనగామలోని ఓటర్ నమోదు కేంద్రాలను తనిఖీ చేసి ఇప్పటివరకు కేంద్రాల్లో ఎంతమంది నమోదు చేసుకున్నారని అడిగారు. 18 సంవత్సరాలు పూర్తయిన యువతి, యువకుల నుండి ఆధారాలు సేకరించి వారి పేర్లను జాబితాలో చేర్చే విధంగా కృషి చేయాలని కోరారు. ఫారం 6, ఫారం 8, ఫారం 8ఏల ప్రాధాన్యతలను ఓటర్లకు వివరించాలని అన్నారు. ఓటరు నమోదు కోసం స్వచ్ఛంద సంస్థలను, ప్రజాప్రతినిథులను పార్టీల సహాకారం తీసుకున్నట్లయితే కొంత ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఎన్ని కొత్త పేర్లు నమోదయ్యాయని జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జనగామతో పాటు సమీప మండలాల తహశీల్దార్ కార్యాలయాలను సందర్శించి ఓటర్ నమోదు, తొలగింపు డాటా ఎంట్రీ పద్దతిని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్‌డీవోలు మధుమోహన్, రమేష్, డీఆర్‌వో మాలతిలు పాల్గొన్నారు.

కూరగాయాల సాగులో
జిల్లా మొదటిస్థానంలో నిలవాలి
* మహబూబాబాద్ కలెక్టర్ శివలింగయ్య పిలుపు
నర్సింహులపేట, సెప్టెంబర్ 22: కూరగాయాల సాగులో మహబూబాబాద్ జిల్లా మొదటిస్థానంలో నిలవాలని కలెక్టర్ శివలింగయ్య అన్నారు. శనివారం మండలంలోని బొజ్జనపేట శివారు హీమ్లతండాలో ఉపాధిహామి, హర్టికల్చర్ ఆధ్వర్యంలో రైతులు ఏర్పాటు చేసిన కూరగాయల సాగును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కూరగాయాల సాగుపై ఆసక్తిగల రైతులకు సబ్సిడిపై పందిరిలు, డ్రిప్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని దీనిని రైతులు వినియోగించుకొని అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం గ్రామంలో సాగుచేసిన బీరతోట పంటలను పరిశీలించి పంట లాభం, పెట్టుబడి వివరాలను స్వయంగా కలెక్టర్ రైతు శ్రీనును అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా హార్టికల్చర్‌అధికారి సూర్యనారాయణ, తహశీల్దారు వరప్రసాద్, ఆర్‌ఐ నంద, సూపరింటెండేంట్ లచ్చు తదితరులు పాల్గొన్నారు.

పేద రెడ్డిలను ఆదుకోవాలి: రెడ్డి ఐకాస
కాటారం, సెప్టెంబర్ 22: పేద రెడ్డిలను ఆదుకోవాలని కోరుతూ రెడ్డి సంఘా ల ఐక్య వేదిక కోరింది. ఈ మేరకు రెడ్డి ఐకాస రాష్ట్ర కార్యదర్శి ఉడుముల విజయారెడ్డి సారధ్యంలో శనివారం భారీ ఎత్తున ఆ సంఘాలకు చెందిన సమూహలతో సమావేశం నిర్వహించారు. ఈనెల 26న ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపడుతున్నట్లు విజయారెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు తదితర రాజకీయ పార్టీల మేనిఫెస్టో కమిటీల నేతలను కలిసి రెడ్డి ఐకాస తరుపున వినతి పత్రాలను సమర్పించనున్నట్లు విజయారెడ్డి తెలిపారు. రెడ్డిలకు ప్రత్యే క కార్పోరేషన్ ఏర్పాటుచేయాలనేది తమ ప్రధాన డిమాండ్‌గా వివరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ఐకాస నాయకురాళ్ళు సునీత, శ్రీలత, అనె్నం వెంకటరెడ్డి, రాంరెడ్డి, శివారెడ్డి, పున్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.