వరంగల్

దివ్యాంగుల సంక్షేమానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, సెప్టెంబర్ 22: దివ్యాంగుల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభు త్వం శక్తి వంచన లేకుండా కృషి చేసిందని, రాబోయే రోజులలో వారికి మరింత అండగా ఉంటామని రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట బస్టాండ్‌లో శనివారం దివ్యాంగులు, విద్యార్థులకు ఉచిత బస్ పాసులను పెద్ద అందజేశారు. ఈసందర్భంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 3 వేల మంది దివ్యాంగులు, 4 వేల మంది విద్యార్థులకు రూ.4లక్షల రూపాయలను చెల్లించి ఉచిత బస్సు పాసులను అందిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామని వెల్లడించారు. నర్సంపేట డిపోకు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా 14 జెన్నారం మెట్రో బస్సులను తీసుకవచ్చినట్లు తెలిపారు. త్వరలో రెండు రాజధాని బస్సులతో పాటు మరో ఎనిమిది పల్లె వెలుగు బస్సులను తెప్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ బస్టాండ్ ప్రాంగణంలో తన సీడీఎఫ్ ఫండ్‌తో మినరల్ వాటర్ ప్లాంట్‌ను నెలకొల్పాలమని, కేవలం ఒక రూపాయికి లీటర్ వాటర్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. నర్సంపేట నియోజకవర్గ అభివృద్దికి పెద్ది సుదర్శన్‌రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, వచ్చే ఎన్నికలలో పెద్దిని ఆశీర్వధించాల్సిందిగా కోరారు. ఈకార్యక్రమంలో డీపో మేనేజర్ విజయారా వు, టీఆర్‌ఎస్ నాయకులు మునిగాల వెంకట్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, ఎంవీ.రామారావు, నాయిని నర్సయ్య, మండల శ్రీనివాస్, ఎంపీపీ భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

బాల పురోహితునికి ప్రశంసలు
మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 22: మండల కేంద్రంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 13 ఏళ్ల బాల పురోహితుడు ఆరుణచారి వేదభ్యాసం చేస్తున్న, అర్చన, పూజలు అభిషేకాలు నిర్వహించి మండల ప్రజలను మంత్ర ముగ్ధులను చేశాడు. వీన వంక రవీంద్రాచారి, రజితల కుమారుడు అరుణచారి మంచిర్యాల వేద పాఠశాలలో విద్యభాసం చేస్తు మొట్టమెదటి సారిగా గణపతి నవరాత్రులలో పూజ కార్యక్రమాలను నిర్వహించి అందరి ప్రశసంలు అందుకున్నాడు.

25వరకు ఓటర్ నమోదుకు ఛాన్స్
* ఓటర్ నమోదు అధికారి, ఆర్డీవో మహేందర్‌జీ
సంగెం, సెప్టెంబర్ 22: ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని అర్హత ఉన్నవారందరూ ఈ నెల 25 తేది వరకు దరఖాస్తు చేసుకోవాలని పరకాల నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి ఆర్డీవో మహేందర్‌జీ అన్నారు. శనివారం సంగెం మండల కేంద్రంలో ఓటర్ నమోదుపై తహశీల్ధార్ సత్యనారాయణ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో మహిళా సంఘాలు, అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు, వైద్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది మండల కేంద్రంలో ఓటర్ నమోదుపై ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సెంటర్‌లో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఓటర్ నమోదుపై ప్రజలలో చైతన్యం కలిగించాడానికి 9, 10వ తరగతి, ఇంటర్, డ్రీగ్రీ కళాశాలలో ఓటర్ నమోదుపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో కొత్త ఓటర్లుగా 11,520 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పరకాల నియోజకవర్గంలో గతంలో 232 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వీటికి తోడుగా ఆరు పోలీస్టేషన్లు పెరిగాయని తెలిపారు. సంగెం మండలంలో వంజరపల్లి, పల్లారుగూడ, వడ్డెరిగూడెంలో మూడు పోలింగ్ కేంద్రాలను నూతనంగా ఏర్పాటు చేయనునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.