వరంగల్

కేసీఆర్ మాట.. విజయానికి బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, సెప్టెంబర్ 23: ముఖ్యమంత్రి కేసీఆర్ మాటే తన విజయానికి బాట అని ప్రజల ఆశీర్వాదంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తానని మానుకోట మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. శంకరన్న పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఈదులపూసపల్లి, సీత్లతండా, దర్గాతండ, రేగడిగూడెం, లక్ష్మిపురం, జమాండ్లపల్లి, కొమ్ముగూడెం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు ఘనస్వాగతం పలికారు. యువకులు తీన్‌మార్ నృత్యాలతో గ్రామాల్లోకి తీసుకొని వెళ్లారు. వెళ్లిన ప్రతిచోట పెద్దసంఖ్యలో జనం సమీకరనం కావడంతో వారిని ఉద్దేవించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అదే పోరాట స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవిశ్రాంతంగా పనిచేస్తున్నాడన్నారు. మానుకోట ప్రజలు తనకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని నాలుగున్నర సంవత్సరాల్లో మహబూబాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకవెళ్లడం జరిగిందని మళ్లీ అవకాశం ఇస్తే ఊహించని స్థాయిలో మహబూబాబాద్‌ను తీర్చిదిద్దుతానని తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయని, ప్రతి పల్లెలోనూ తెలంగాణ రాష్టస్రమితికి అనూహ్యమైన ఆధరణ లభిస్తుందని తెలిపారు. కచ్చితంగా మహబూబాబాద్‌లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయం అని, వందసీట్లు సాధించి తిరుగులేని ఆదిక్యంతో మళ్లీ అధికారంలోకి వస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు సుదగాని మురళీ, తేళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల హామీలు ఏమయ్యాయి?
* మాజీ ఎమ్మెల్యే సీతక్క
కొత్తగూడ, సెప్టెంబర్ 23: నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు చేసిన హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే సీత క్క ప్రశ్నించారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరికలలో భాగంగా ఎదుళ్ళపల్లి, రంగప్పగూడెం, జంగవానిగూడెం, ఓటాయి, గుంజేడు గ్రామాలలో ఆమె పర్యటించారు. ఈసందర్భంగా సీతక్క మాట్లాడుతూ కేం ద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం నియంత పాలనను అవలంభిస్తున్నారన్నారు. స్వరాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రతిపక్ష పార్టీలపై ఆంక్షలు విధిస్తూ ధర్నా చౌక్‌ల ఎత్తివేత, చెక్‌పోస్టులతో తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు అక్కడ కేసీఆర్‌కు, ఇక్కడ చందులాల్‌కు లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు ఇచ్చిన హక్కు పత్రాలను తిరస్కరిస్తూ హరితహారం పేరుతో రైతుల భూములను స్వాధీనం చేసుకోవటం సిగ్గుచేటన్నారు. కులాల వారిగా పథకాలను సృష్టిస్తూ నిరుపేదలను బానిసలుగా మారుస్తున్నారన్నారు. ఏడాదిలో ముస్లింల ఎంతో పవిత్రమైన రంజాన్ వేడుక రోజున గుర్తించారని వారి సంక్షేమాన్ని మాత్రం విస్మరించారన్నారు. ప్రజలకు అందుబాటులో రాకుండా సీఎం కేసీఆర్ ప్రగతి భవనంలో ఉంటూ సానుకూల వ్యక్తులతో మాత్రమే మాట్లాడటం వెనుక ఆతర్యమేమిటని ఆమె ప్రశ్నించారు. అది ప్రగతి భవనం కాదని పైరవీల భవనంగా మారిందని ఆమె ఎద్దేవ చేశారు. రైతు బందు పథకంలో రైతులకు వాతలు పెడుతూ ధనికులకు కొమ్ముకాస్తూ సొమ్ము చేసుకుంటున్నాడన్నారు. అనంతరం ముస్లింలు 150 మంది ఆయా పార్టీల కార్యకర్తలను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి కండువాతో ఆమె ఆహ్వానించా రు. కార్యక్రమంలో వజ్జ సారయ్య, మధుసూదన్ రెడ్డి, నారాయణ రెడ్డి, బిట్ల శ్రీను, రాజం సారంగం, ముస్కు వెంకన్న, కట్రోజు బిక్షపతి, వెలుదండి వేణు, సమ్మయ్య, దేశ్యా తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌షాక్‌తో బావిలో పడి రైతు మృతి
లింగాలఘణపురం, సెప్టెంబర్ 23: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి పక్కనే ఉన్న బావిలో పడి ఓ రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని నవాబ్‌పేట గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చింతల నర్సయ్య అనే రైతు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి విద్యుత్ మోటర్‌ను ఆన్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి పక్కనే ఉన్న బావిలో పడి రైతు మృతిచెందాడు. ఉదయానే్న వెళ్లిన చింతల నర్సయ్య ఇంటికి రాకపోవడంతో భార్య సారమ్మ, కుటుంబ సభ్యులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా బావిలో పడిన చింతల నర్సయ్యను చూసి బోరుమని విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించా రు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.