వరంగల్

ఇకపై సామాజిక మాధ్యమాలే ప్రచార వారధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, సెప్టెంబర్ 23: ముందస్తు ప్రచారం క్రమంగా వేడెక్కుతోంది. ఆయా పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు తమ పార్టీ ప్రచారంపై దూకుడు పెంచారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి వినూత్నంగా ప్రయత్నంపై దృష్టి సారించారు. అందుకు వేదికగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వాట్సాప్‌ను వేదికగా ఎంచుకొంటున్నారు. పలు పార్టీ నేతలు ఇప్పటికే పల్లె నంచి పట్నం వరకు విడివిడిగా గ్రూపులు ఏర్పాటు చేసి పోస్టులు పెడుతున్నారు. అయితే గతంలో ఎన్నికల ప్రచారంలో గోడ రాతలు, ఇంటింటికి కరపత్రాలు, బ్యానర్ల వినియోగం ఎక్కువగా ఉండేది. కాలానికి అనుగుణంగా నేతలు డిజిటల్ ప్రచారంపై దృష్టి సారించారు. ప్రస్తుతం అందరి చేతిలో స్మార్ట్ఫోన్ ఉంది. జియో విప్లవం తరువాత అంతర్జాల వినియోగం పెరిగింది. వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వీక్షణం ఇప్పుడు ప్రతి ఒక్కరికి నిత్యకృత్యం అయింది. నేతలు ఓటర్లను అకట్టుకోవడానికి వీటినే ప్రచార మార్గాలుగా ఎంచుకొంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నా యి. ప్రజలు వినియోగించే వాటిలో మా త్రం వాట్సాప్, ఫేస్‌బుక్‌దే సింహభాగం. ఈ మాధ్యమాల్లో బృందాలను ఏర్పాటు చేసి తమ సందేశాలను పంచుకుంటున్నారు. దాదాపుగా ఓటర్లలో 60 శాతం మందికి వాట్సాప్, ఫేస్‌బుక్ అకౌంట్ ఉందని ఓ అంచనా. ఇక ఫేస్‌బుక్, ట్విటర్‌ను విద్యార్థులు యువత ఎక్కువగా వినియోగిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు వాట్సాప్‌లో బృందాలు ఏర్పాటు చేసి తమ అభిమాన నాయకుల కార్యక్రమాలు, వారి గుణగణలను తెలియజేస్తూ సమాచారం పంపిణి చేస్తున్నారు. ఇదం తా ద్వితీయ శ్రేణి నాయకుల కనుసన్నల్లో కొనసాగుతోంది. కొన్ని పార్టీలు గ్రామ, మండల నియోజకవర్గ స్థాయి గ్రూపుల ఏర్పాటుపై దృష్టి సారించారు. నాయకుల కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా వారి తరుపున సామాజిక మాధ్యమాల ఖాతాలను నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనే నాయకుల కటౌట్‌లతో చక్కటి చిత్రాలను తయారు చేసి ప్రచా రం చేస్తున్నారు.

* నెంబర్ల సేకరణ..
నియోజకవర్గాల వారీగా ఆయా పార్టీల నేతలు వాట్సాప్ ద్వారా తమ సందేశాన్ని తెలిపేందుకు యత్నిస్తున్నాయి. ఇందుకు మొబైల్ నెంబర్లు అవసరం. వాటి సేకరణ బాధ్యత ఆయా గ్రామాల పార్టీ శ్రేణుల నుంచి తీసుకోవాలని యోచిస్తున్నారు. ముఖ్యంగా ఆయా గ్రామాల బాధ్యులతో పార్టీ ప్రచార సందేశాన్ని ఆ ప్రాంత ఓటర్లకు చేరవేసే ప్రయ త్నం చేస్తున్నారు. సాంకేతికతను వినియోగించే యువ సైన్యం కోసం అనే్వషిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యం లో శ్రుతి మించితే చర్యలు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించడానికి సాం కేతికతను వినియోగించుకుంటోంది. ఇప్పటి వరకు ఎన్నికల నియామావళి ఉల్లంఘనపై ఫిర్యాదులను నేరుగా స్వీకరించేది. ప్రస్తుతం సి-విజేల్ యాప్‌ను రూపొందించి అభ్యర్థులు ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తుంటే పౌరులెవరైనా చిత్రాలు, వీడియోలు తీసి సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. అందిన చిత్రాలు, వీడియోల అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించి అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవడానికి ఈ యాప్ దోహదం చేయనుందని సమాచారం.

లడ్డూ రూ.3,00,116/-
‘లక్కీ’గా లక్షన్నర లడ్డూ రూ.25లకే..
కేసముద్రం, సెప్టెంబర్ 23: కేసముద్రం మండల కేంద్రంలోని బడితండాలో ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూకు ఆదివారం నిర్వహించిన వేలం పాటలో రికార్డు ధర రూ.3,00116లకు అదే తండాకు చెందిన బానోత్ మోహన్ అనే వ్యక్తి దక్కించుకున్నాడు. మహబూబాబాద్ జిల్లాలో లడ్డూకు ఇదే అత్యధిక ధరగా పేర్కొంటున్నారు. కేసముద్రం మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆదిదేవ వెల్ఫేర్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూను బచ్చు పరమేశ్వర్ అనే వ్యాపారి రూ.1,71,116లకు దక్కించుకోగా, తాజాగా రూ.3 లక్షలకు పైగా ధర పెట్టడం విశేషంగా మారింది. కాగా మండల కేంద్రంలో కానిపాక వినాయక మండలి వద్ద తాపేశ్వరంలో ప్రత్యేకంగా తయారు చేయింఒచిన లక్షన్నర విలువైన 12 కిలోల లడ్డును కేవలం రూ.25 రూపాయలకే లక్కీ డ్రాలో మాసాడి రోహిత దక్కించుకున్నారు. ఈ లడ్డూ విక్రయానికి రూ.25 రూపాయల టోకెన్లు విక్రయించగా ఆదివారం నిర్వహించిన డ్రాల్లో ఆమెకు లభించింది.