వరంగల్

ఎన్ని మహాకూటమిలు వచ్చిన తెరాసను ఏం చేయలేరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, సెప్టెంబర్ 24: కేసీఆర్‌ను చూస్తే మహాకూటమి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం పరకాల పట్టణంలోని పుష్పాంజలి గార్డెన్స్‌లో పరకాల, నడికూడ మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన సంస్థ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు హాజరైన్నారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాలు కోలుకోలేని స్థితిలో ఉన్నాయన్నారు. కరెంటు తీగలపై బట్టలు ఆరేసిన ఘనత ప్రతిపక్షాలది అయితే రెప్పపాటు కూడా కరెంటు పోకుండా సరఫరా చేస్తున్న ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదన్నారు. ముందస్తు ఎన్నికలకు కారణం ప్రతిపక్ష పార్టీలదేనని పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు, కేసిఆర్ చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ఇంత అభివృద్ధి జరిగితే పుట్టగతులుండవనే ప్రతిపక్షాలు తెరాస ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. ఎన్ని మహాకూటమిలు వచ్చిన తెరాసను ఏం చేయలేరని చెప్పారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తెరాసను గెలిపిస్తాయని తెలిపారు. పారదర్శకంగా నేరుగా ప్రతి సంక్షేమ ఫలాలను లబ్దిదారులకు అందించిన ఘనత తెరాస ప్రభుత్వానిదన్నారు. గ్రామాలలో ప్రతి కార్యకర్త పార్టీ కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని, కేసిఆర్ చేయించిన అన్ని సర్వేలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల నియోజకవర్గం ముందంజలో ఉందని చెప్పారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే బిక్షపతిలు ప్రసంగించారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ బిక్షపతి, జడ్పీటీసీ పాడి కల్పనాదేవి, తెరాస నాయకులు నాగిరెడ్డి, మొగిళి, శోభన్‌బాబు, సాంబరెడ్డి పాల్గొన్నారు.

అడవులు నరికితే పీడీ యాక్ట్
* అడవుల సంరక్షణ
ప్రతి ఒక్కరి బాధ్యత
మంగపేట, సెప్టెంబర్ 24: అడవిని నరికితే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని తాడ్వాయి డివిజనల్ పారెస్ట్ ఆఫీసర్ ఎన్. కొండల్‌రావు హెచ్చరించారు. మంగపేట మండలంలోని కంపార్ట్‌మెంట్ నాలుగులో గంపోనిగూడెంకు చెందిన కొందరు పోడు చేసుకునేందుకు అక్రమంగా నరికివేసిన ప్రాంతాన్ని సోమవారం స్థానిక అటవీశాఖ అధికారులతో కలిసి కొండల్‌రావు పరిశీలించారు. పోడు చేసుకునేందుకు నరికిన చెట్ల కు మంగపేట అటవీ శాఖ సిబ్బంది నెం బర్లు వేయడాన్ని ఆయన పరిశీలించారు. అడవి నరికవేతకు గురవకుండా చూడాలని స్థానిక అధికారులకు ఆదేశాలిచ్చారు. అనంతరం మంగపేట అటవీశాఖ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో కొండల్‌రావు మాట్లాడుతూ మంగపేట రేంజ్, మంగపేట సెక్షన్‌లో 3,4,5 కంపార్ట్‌మెంట్‌లలో గల 2418 ఎకరాలు రెవెన్యూ కు చెందినదిగా 2018 జూలై 19న ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెటర్ జారీ చేశారన్నారు. అయితే ఆ ప్రాంతం మొత్తం తమ అటవీశాఖకు చెందినదే అని అన్నారు. 1953 ఆగస్టు 14న విడుదల చేసిన గెజిట్‌నోటిఫికేషన్ జీఓ ఎంఎస్ నెంబర్ 10375 చట్ట ప్రకారం మరియు సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ప్రకారం రెండు విధాలుగా చూసినా ఆ ప్రాంతం అటవీశాఖదేనన్నారు. ఈ విషయం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. ఈ క్రమంలో అటవీశాఖ, పోలీస్ శాఖలు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని 2018 ఆగస్టు 14న ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెటర్ ఇవ్వడం జరిగిందన్నారు. అడవిని నరికితే ఉపేక్షించేది లేదని పీడీ యాక్ట్ కింద కేసు లు పెడతామని హెచ్చరించారు.