వరంగల్

తెలంగాణకు ప్రథమ శత్రువు టీఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, సెప్టెంబర్ 24: తెలంగాణకు ప్రథమ శత్రువు టీఆర్‌ఎస్ పార్టీ అని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే సిద్ధాంతాలను పక్కనబెట్టి కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, జన సమితి పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. నర్సంపేటలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ విధానాల వల్ల తెలంగాణలో ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిందని, ఈతరుణంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, కేసీఆర్‌ను గద్దె దించడమే ఏకైక ఏజెండాగా మహాకూటమి అవతరించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఎన్నికల వేల కార్య రూపం దాల్చని పనులకు సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి జీఓలు తెస్తూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకనాడు జీబులలో ప్రయాణికుల వద్ద ప్రయాణచార్జీలు వసూలు చేసే క్లీనర్‌గా పనిచేసి న పెద్ది సుదర్శన్‌రెడ్డికి నేడు కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో నియోజకవర్గ ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణాభివృద్దికి రూ.30కోట్లు, మరో సారి రూ.20కోట్లు రూపాయలు మంజూరు అయ్యాయని, జీఓలు తెచ్చారని, అయి తే ఇంత వరకు ఏ ఒక పని కార్యరూపం దాల్చలేదన్నారు. నర్సంపేట నియోజకవర్గం తన హయాంలోనే అభివృద్ది జరిగిందన్నారు. తాను వేసిన రోడ్లపైనే పెద్ది తిరుగుతున్న విషయాన్ని గమనించాలన్నారు. 2009 ఎన్నికలలో కూటమిగా ఏర్పడ్డప్పుడు పెద్ది అనుసరించిన వైఖరి మర్చిపోలేదని, నీతి, నిజాయితీ ఉంటే దేవాలయ ప్రాంగణంలో సమాధానం చెప్పాలని అన్నారు. నర్సంపేటలో మహాకూటమి అభ్యర్థికి, పెద్దికి మద్యే పోరు ఉంటుందని, ఇందులో ఎలాంటి అపోహలకు, అసత్య ప్రచారాలకు తావులేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈవిలేఖరుల సమావేశంలో టీడీపీ నియోజకవర్గ నాయకులు ఎర్ర యాకూబ్‌రెడ్డి, అజ్మీరా శ్రీనివాస్, వేముల బొందయ్యగౌడ్, జాటోతు సంతోష్‌నాయక్, నరేందర్‌రెడ్డి, చుక్క రమేష్, జనగం స్వామి, కొయ్యడి సంపత్, మామిండ్ల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.