వరంగల్

బతుకమ్మ సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 9: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలకు సంప్రదాయాలకు ఉట్టిపడే బతుకమ్మ పండుగ సంబురా లు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఆట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తీరొక్క పూలతో తొలి రోజు ఎం గిలి పూల బతుకమ్మతో ప్రారంభం అయ్యే ఈ సంబురాలు 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ నెల 17న జరిగే సద్దుల బతుకమ్మతో ఈ సంబురాలు ముగుస్తాయి. తెలంగాణలో మహిళలకు అత్యంత ఇష్టమైన పండుగలలో బతుకమ్మ పండగ ప్రధానమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ అర్బన్ , రూరల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఘనంగా ప్రారంభం అయ్యాయి. మహిళలు తీరొక్క పూలతో ఇంటి వద్దనే బతుకమ్మను తీరొక్క పూవ్వుతో పేర్చుకుని మహిళలు గుంపులు గుంపులుగా వెళ్లి చెరువు కట్టకు, దేవాలయాల్లో, ప్రధాన కూడళ్ల వచ్చి ఆటలు ఆడారు. వరంగల్ నగరంలోని వేయి స్థంబాల గుడిలో వేలాది మంది మహిళలు బతుకమ్మ ఆటలు ఆడారు. అదే విధంగా భద్రకాళీ, పద్మక్షి గుండం, వడ్డేపల్లి చెరువు తదితర కూడళ్లలో మహిళలు అనేక కూడళ్లలో మహిళలు బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ సంబురాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే విధంగా కాజీపేట వడ్డేపల్లి చెరువు కట్ట వద్ద బాలవికాస ఆధ్వర్యంలో 200 మంది వితంతువులతో బతుకమ్మ సంబురాలు జరిగాయి.