వరంగల్

అసమ్మతి చల్లబడిందనడం అవాస్తవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, అక్టోబర్ 14: తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన నాయకులను, కార్యకర్తలను మానుకోట నియోజకవర్గంలో ఘోరంగా అవమానిస్తున్నారని ఇది పార్టీ ప్రయోజనాలకు క్షేమకరం కాదని తెరాస రాష్ట్ర నాయకులు బానోత్ రవికుమార్ అన్నా రు. మానుకోటలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమన్వయ కమిటీ సమావేశం పేరుతో మహబూబాబాద్‌లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో ఏమాత్రం పురోగతి లేదని.. అస మ్మతి చల్లబడిందని అనడం అవాస్తవం అని అన్నారు. ఆ సమావేశానికి ఉద్యమకారుల పక్షాన మానుకోట టికెట్ కోసం పోటీపడ్డ తనను పిలువకపోవడం దీని కి ఆంతర్యం ఎంటో సమాధానం చెప్పాలని రవికుమార్ డిఫ్యూటీ సీఎం కడి యం శ్రీహరి ప్రశ్నించారు. నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అమితమైన ఆధరణ ఉందని, తెలంగాణ రాష్టస్రమితిని గెలిపించుకోవాల్సిన అకాంక్ష ప్రజల్లో ఉందన్నారు. కాని అభ్యర్థి శంకర్‌నాయక్‌పట్ల ప్రజల్లో సానుకూలత లేదని అందుకే పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఉద్యమకారుల కోటాలో తనకు టికెట్ కేటాయించాలని పలుమార్లు పార్టీ అధినాయకత్వాన్ని కోరడం జరిగిందన్నారు. చివరి నిమి షం వరకు మానుకోట టికెట్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటామని రవికుమార్ తెలిపారు. అంతమాత్రాన టీఆర్‌ఎస్‌ను వదిలి వెళ్లమని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి కేటీఆర్ సూచనల మేరకు పనిచేస్తామని తెలిపారు. మానుకోట విషయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన వైఖరి మార్చుకుంటే మంచిదని రవికుమార్ అన్నారు. ఈవిలేఖరు ల సమావేశంలో టీఆర్‌ఎస్‌ఎవి నాయకులు రామన్ననాయక్, భాస్కర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.