వరంగల్

రిజర్వాయర్లన్నీ వైఎస్సార్ చలవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్మెట, అక్టోబర్ 14: ‘పార్టీలు కాదు.. వ్యక్తులు ముఖ్యం, గెలిచిన వ్యక్తి మంచివాడైతేనే గ్రామాలు అభివృద్ధికి నోచుకుంటాయి, కబ్జాలు కాదు అభివృద్ధే నా లక్ష్యం’ అని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం మం డల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్మెట మండల ప్రజలు నాకు రాజకీయ జీవితాన్నిచ్చారని, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశానని, విద్య, వైద్యం, సాగునీటికోసం కృషిచేశానని, మండలంలోని నాలుగు రిజర్వాయర్లు దివంగతనేత వైఎస్సార్ చలవేనన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న నామాటకు విలువనిచ్చి దేవాదుల రూట్‌మ్యాప్‌ను నర్మెటమండలం మీదుగా తపాస్‌పల్లికి మార్పించారు. స్థానికేతరులైన పొన్నాల లక్ష్మయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేసి న అభివృద్ధి శూన్యంఅని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తాను భరిలోనే ఉన్నావని, కార్యకర్తల నిర్ణయం మేర దసరా అనంతరం పూర్తి కార్యచరణ రూపొందించి ప్రజల వద్దకు వస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాదె మోహన్‌రెడ్డి, గంగం నర్సింహారెడ్డి, గడ్డం నర్సయ్య, ముక్కెర బిక్షపతి, ఎండీగౌస్, ఎండీ గౌస్, పోగుల చంద్రారెడ్డి, బండి రాములు, సుధాకర్‌రెడ్డి, మూల కర్ణాకర్‌లు పాల్గొన్నారు.

తైక్వాండో రాష్ట్ర పోటీలకు కేసముద్రం క్రీడాకారులు
కేసముద్రం, అక్టోబర్ 14: హన్మకొండలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ తైక్వాండో పోటీల్లో కేసముద్రం (స్టే) హైస్కూల్, శ్రీవివేకవర్ధిని హైస్కూల్ క్రీడాకారులు అత్యంత ప్రతిభ చాటారు. ఈ మేరకు ఈ నెల 15 నుండి నల్లగొండలో నిర్వహించే రాష్టస్థ్రాయి పోటీల్లో పాల్గొనేందుకు ఎం పికయ్యారు. కేసముద్రం (స్టే) హైస్కూల్‌కు చెందిన మహ్మద్ ఆసియా, అం డర్ 17 విభాగం, మహ్మద్ నస్రిన్ అండర్ 14 విభాగంలో ఎంపికయ్యారు. అలాగే శ్రీవివేకవర్ధిని హైస్కూల్ క్రీడాకారులు జాటోత్ మధు, బండారు స్ఫూర్తి, అరెందుల గణేష్, మార్క రాజేష్‌లు ఎంపికైట్లు తెలిపారు. ఈ మేరకు రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను హెడ్మాష్టర్ శాంతకుమారి, తైక్వాండో క్లబ్ ప్రధాన కార్యదర్శి చీకటి వెంకట్రాంనర్సయ్య, రమేష్‌కుమార్, కోచ్ స్వర్ణలత, ఎస్వీవీ కరస్పాండెంట్ చిర్ర యాకాంతంగౌడ్, కోచ్ కల్లెపల్లి రమేష్ అభినందించారు.