వరంగల్

రైతులతో కడియం మమేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 14: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌నే మరో సారి ముఖ్యమంత్రి చేస్తామని రైతు లు భరోసా ఇస్తున్నారని ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నా రు. ఆదివారం వరంగల్ నుండి నర్సంపేటలో ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభకు వెళ్తున్న కడియం శ్రీహరి మార్గ మధ్యంలో పొలాల్లో రైతులను చూసి కారు ఆపి దిగారు. వారి వద్దకు వెళ్లి పలకరించారు. పంటలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం పనితీరు బాగుందా, సంక్షేమ పథకాలు సరిగ్గా అందుతున్నాయా అంటూ ఆరా తీశారు. రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా మీ ఆడ పిల్లల పెళ్లిలకు కళ్యాణలక్ష్మి మొత్తం ఇచ్చారని అని అడిగారు. ఈ సందర్భంగా రైతులు రైతు బందు పధకం కింద పంట పెట్టుబడి, కళ్యాణలక్ష్మి పథకం కింద ఆడపిల్లల పెళ్లికు ఆర్ధిక సాయం పొందామని తెలిపారు. కేసీఆర్ పరిపాలన బాగుందని అందుకే కేసీఆరే మరో సారి ముఖ్యమంత్రి అవుతారని రైతులు కడియంతో వెల్లడించారు. ఆనంతరం కడియం శ్రీహరి రైతులతో సాయం చేసిన వారిని మర్చి పోవద్దని కేసీఆర్‌కు ప్రభుత్వాన్ని మరో సారి ఆశీర్వదించాలని కోరారు.

గుండా రాజకీయాలు సాగనివ్వం
* అభివృద్ధికి అడ్డుపడుతున్న ‘దొంతి’ * టీఆర్‌ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట, అక్టోబర్ 14: నర్సంపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రౌడీ, గుండా రాజకీయాలకు తెరలేపారని, దమనకాండను ఎట్టి పరిస్థితులలో సాగనివ్వమని రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్, టీఆర్‌ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించా రు. గతంలో గిరిజనుల ఆరాధ్యదైవమై న శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా లంబాడీలపై దౌర్జన్యం చేశారని, ఇటీవల చెన్నారావుపేట మండలంలో తమ తం డాకు తారు రోడ్డు వేయాలని కోరిన గిరిజన యువకులపై దాడి చేశారని చెప్పా రు. నర్సంపేట నియోజకవర్గాన్ని విజన్‌తో అభివృద్ది చేస్తానని, ఒక్క అవకాశం ఇచ్చి తనను ఆశీర్వధించి అసెంబ్లీకి పంపించాలని పెద్ది కోరారు. నర్సంపేటలో మాల మహానాడు, నంగారభేరి ల ఆధ్వర్యంలో ఆదివారం వేర్వేరుగా ప్రజా ఆశీర్వాధ సభలు జరిగాయి. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో కొత్తగా 76 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయని, వీటిలో 54 గ్రామ పంచాయతీలు తండాలేనని చెప్పారు. తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయవద్దని దొంతి మాధవరెడ్డి కలెక్టర్‌కు, ఇతర అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారని, త్వరలోనే తాను ఆలేఖలను బయటపెడతానని చెప్పారు. 32 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులను టెండర్‌లో దక్కించుకున్న దొంతి మాధవరెడ్డి గత మూడేళ్లుగా ఆపనులు చేయకుండా అభివృద్దిని అడ్డుకున్నారని ఆరోపించారు. గుడుంబా బాధితులకు పునరావసం కోసం 810 మందికి రెండు లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని మం జూరు చేయిస్తే నర్సంపేటకు అదనంగా ఎందుకు వచ్చాయంటే దొంతి అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులకు యాబై శాతం సబ్సీడీపై విద్యుత్ మోటార్ల పథకాన్ని తీసుకవస్తే ఈపథకాన్ని సైతం అడ్డుకునేందుకు కుట్రలు పన్ని కలెక్టర్‌కు, ఎన్నికల కమీషన్‌కు దొంతి మాధవరెడ్డి ఫిర్యాదు చేశారని, రేవూరి ప్రకాశ్‌రెడ్డి గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సంక్షేమ పథకాలు ఆగే ప్రసక్తే లేదన్నారు. కులసంఘాలకు ఆత్మగౌరవ భవనాలు తీసుకవస్తే ఆ జీఓ లు ఉత్తవేనని చెబుతున్న దొంతి తాను చేస్తున్న కాంట్రాక్టు పనులకు సంబంధించిన జీఓలు కూడా నిజమైనవో కాదో చెప్పాలని డిమాండ్ చేశారు.