వరంగల్

ఎంపీడీఓలకు స్థానచలనం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, అక్టోబర్ 16 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మండల పరిషత్తు అభివృద్ధి అధికారుల బదిలీలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాధారణంగా ఎంపీటీసీ ఎన్నికల సమయంలోనే ఎంపీడీఓ బదిలీలు జరుగుతుంటాయి. 2014 ఎన్నికల సమయంలో ఎంపీడీఓలకు మాడల్ కోడ్ అధికారులుగా విధులు అప్పగించడంతో బదిలీకి అర్హులైన వారందరికీ స్థానం చలనం కలిగింది. తాజాగా ఈ ఎన్నికల సమయంలోనూ అందరు ఎంపీడీఓలకు మాడ ల్ కోడ్ అధికారిగా బాధ్యతలు అప్పగించడంతో బదిలీలు తెరపైకి వచ్చాయి. దీనికి తోడు పంచాయతీరాజ్ కమిషన్ నుంచి ఉత్తర్వులు రావడంతో బదిలీలు ఖాయమనే వ్యాఖ్యలు అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. బదిలీలు ఉమ్మడి జిల్లాలోనే కొత్తగా ఏర్పడిన జిల్లాల పరిధిలోనే వీరికి బదిలీలు ఉంటుందా... లేక ఇతర ఉమ్మడి జిల్లాకు వీరిని బదిలీ చేస్తారా అనే దానిపై మాత్రం స్పష్టత లేదని అధికారులు పేర్కొంటున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో రెవెన్యూ అధికారుల బదిలీలే జరుగుతుంటాయి. పోయిన సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఎంపీడీఓల బదిలీలు జరిగాయి. ఈ సారి బదిలీలు ఉంటాయా? లేదా ? అనే దానిపై గత కొన్ని రోజులుగా చర్చ కొనసాగుతుండగా తాజాగా పంచాయతీరాజ్ కమిషన్ నుంచి జిల్లా పరిషత్ అధికారులకు దీనికి సంబంధించి ఉత్తర్వులు రావడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఎంపీడీఓల జాబితా తయారు చేయాలని ఆదేశాలు రావడంతో బదిలీలు ఖాయమనే వ్యాఖ్యలు అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. 2018 నవంబర్ నాటికి ఒకే మండలంలో ఒకే జిల్లా అంటే కొత్త జిల్లాల్లో మూడేళ్లుగా పని చేస్తున్న వారి జాబితా సేకరిస్తున్నారు. దీనికి తోడు సొంత జిల్లాలో పని చేస్తున్న వారెందరనే వివరాలు అధికారులు పరిశీలిస్తున్నారు. రెండు నిబంధనలు వర్తించే ఎంపీడీఓలు ఎంత మంది ఉన్నారనే దానిపై సమాచారం అధికారులు సేకరించారు. అధికారుల లెక్కల ప్రకారం గుర్తించిన సమాచారంపై జాబితా సిద్దం చేస్తున్నారు. ఒక వేళ బదిలీలు జరిగితే పంచాయతీరాజ్ చరిత్రలో ఇది రెండోసారి కానుంది. అధికారులు మాత్రం కమిషనర్ కార్యాలయం నుంచి వివరాలు అడగడంతో తప్పని సరి స్థానభ్రంశం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఉమ్మడి జిల్లాను పరిగణనలోకి తీసుకొని బదిలీ చేస్తే మాత్రం ఎంపీడీఓలంతా ఇతర ఉమ్మడి జిల్లాలకు వెళ్లాల్సిందే. దీనిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుందని అధికారులు పేర్కొంటున్నారు.

జనగామలో ఎన్నికల కంట్రోల్ రూమ్ ఏర్పాటు
* ఫిర్యాదులకై టోల్‌ఫ్రీ నం. 18004251118
* రిటర్నింగ్ అధికారి మధుమోహన్
జనగామ టౌన్, అక్టోబర్ 16: రానున్న సాధారణ ఎన్నికల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసినట్లు జనగామ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆర్‌డీవో సీహెచ్. మధుమోహన్ తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓటర్లకు ఎదురవుతున్న సమస్యలు తెలియచేసేందుకు ప్రత్యేక గ్రీవెన్‌సెల్, కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటుచేసేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశించిందని అన్నారు. అందులో భాగంగానే జనగామలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటుచేశామని తెలిపారు. 24 గంటల పాటు ఈ కంట్రోల్‌రూమ్ పనిచేస్తుందన్నారు. అందుకు సంబందించిన సిబ్బందిని ఏర్పాటుచేశామని అన్నారు. ఫిర్యాదులు స్వీకరించాడానికి లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004251118 ద్వారా సమాచారాన్ని తీసుకోవడానికి కంట్రోల్‌రూమ్‌లో ప్రత్యేక ఉద్యోగి ఉంటాడని తెలిపారు. 8 గంటలకు ఒక ఉద్యోగి మారనున్నట్లు వివరించారు. ఏవైనా సమస్యలు ఎదురయితే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందివ్వాలని కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరిచాలని ఆయన కోరారు.

సామూహిక శీమంత మహోత్సవం
మహబూబాబాద్, అక్టోబర్ 16: మహబూబాబాద్‌లోని హన్మంతునిగడ్డలోని అంబేద్కర్ కమ్యునిటిహాల్‌లో దళిత హిందుపరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం సామూహిక శ్రీమంత మహోత్సవం నిర్వహించారు. ఈ సం దర్భంగా దళితహిందు పరిషత్ వ్యవస్థాపకులు అనిల్‌జి, గర్రెపెల్లి వెంకటేశ్వర్లు ముఖ్య అతిధిలుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహిళా విభా గం అధ్యక్షురాలు గొర్రె దీపిక అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీమం తం కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గాయత్రి అమ్మవారిని పూజించిన అనంతరం గర్భిణీల కు పండ్లు, పూలు, మిఠాయిలు, చీరెలు పెట్టి శ్రీమంతం చేశారు. దళిత హిందు పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌జి మహిళలకు పాదపూజ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భవతిగా ఉన్న రోజు నుండి ప్రసవం అయ్యేంతవరకు సానుకూల ఆలోచనలతో ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో లక్ష్మి, అనురాధ, స్వరూప, అంజలి, రజిత, ఉదయమ్మ పాల్గొన్నారు.