వరంగల్

ఎన్నికలకు అన్ని పార్టీలు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, అక్టోబర్ 16: ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని భూపాలపల్లి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఆయన శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో మీడి యా సెంటర్‌ను ప్రారరంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చివరి ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి కొత్త ఓటర్ల నమోదుకు అన్ని రాజకీయ పార్టీలు చొరవ చూపాలన్నారు. నామినేషన్ల ప్రక్రియకు 10 రోజుల ముందు వరకు ఓటరు నమోదు దరఖాస్తుకు అవకాశం ఉంటుందన్నారు. మీడియా సెంటర్ ఏర్పాటు వల్ల ఎన్నికలకు సంభందించిన సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. చెల్లింపు వార్తల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు సువిధ యాప్ ద్వారా ఎన్నికల సభలు, సమావేశాలు, ర్యాలీల కోసం 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, ములుగు, భూపాలపల్లి ఆర్డీవోలు రమాదేవి, వెంకటాచారి, జిల్లా పంచాయితీ అధికారి చంద్రవౌళి, డీపీఆర్‌వో రవికుమార్, డీఆర్‌డీవో సంజీవ్‌రావు, డీఎస్పీ డీవో భాగ్యలక్ష్మి, సీపీవో భిక్షపతి, వివిధ పార్టీల నాయకులు రాజిరెడ్డి, భూమయ్య, రాజయ్య, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ నాయకుల మాయమాటలకు మోసపోవద్దు
* కాంగ్రెస్ పార్టీతోనే ప్రజల సంక్షేమం: దొంతి
నర్సంపేట, అక్టోబర్ 16: డబుల్ బెడ్ రూంలు, కమ్యూనిటీ హాల్స్ ఇస్తామని పూటకో మాట చెబుతున్న టీఆర్‌ఎస్ నాయకుల మాటలను ప్రజలెవరూ నమ్మవద్దని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరారు. నర్సంపేట పట్టణంలోని సర్వాపురంలో మాజీ సర్పంచ్ చిలుక నర్సయ్య, పాకనాటి బుచ్చిరెడ్డి, గండి రాము, బొమ్మినేని సత్యం, రమేష్, రాజవౌళి, రాపోలు శ్రీను, సమ్మయ్య, రాంబాబు, ఓర్సు వెంకన్న, తాడెం సమ్మయ్య ముదిరాజ్‌తో పాటు రెండు వందల మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు మంగళవారం దొంతి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. ఇందిరమ్మ బీసీ కాలనీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సర్వాపురం ఎస్‌బీహెచ్ నుండి మహబూబాబాద్ రోడ్ వరకు సీసీ రోడ్డు నిర్మాణాన్ని కాంగ్రెస్ హయాంలోనే నిర్మించామని చెప్పారు. కాగా టీఆర్‌ఎస్ నాయకులు పూటకో మాట, రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పెండెం రామానంద్, ఖానాపురం ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా మాజీ వార్డు సభ్యుడు, టీఆర్‌ఎస్ నాయకుడు పొదిల రాంచందర్ మంగళవారం ఆపార్టీకి రాజీనామా చేసి దొంతి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

మహాకూటమి మాటలు నమ్మొద్దు
మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్
వరంగల్, అక్టోబర్ 16: మహాకూటిమి అభ్యర్థులు మాయమాటలు, మోసపూరిత వాగ్ధానాలు నమ్మి మోసపోవద్దని పశ్చిమ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ కోరారు. మంగళవారం కాజీపేటకు చెందిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపి పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆధ్వర్యంలో తెరాస పార్టీలో చేరారు. 35వ డివిజన్‌లోని బాపూజీ నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండి చందర్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో తెరాస పార్టీలోకి చేరారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్ధి వినయ్‌భాస్కర్ వారికి గులాభి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కేసీఆర్ చేపట్టిన అభివృ ద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్య లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నా రు. పార్టీలో చేరికలను పురస్కరించుకుని నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన పార్టీ శ్రేణులు, కార్పోరేటర్ల, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకుల అధ్వర్యంలో వినయ్‌భాస్కర్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ భారీ సంఖ్య లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ కాజీపేటలో బాపూజీ నగర్‌లో నిర్వహిస్తున్న పార్టీ చేరికలు కార్యక్రమం వరకు కొనసాగింది.