వరంగల్

కుటుంబపాలన అంతానికే కూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, అక్టోబర్ 16: తెలంగాణ వనరులను ఆంధ్రాకాంట్రాక్టర్లకు దారదత్తం చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించేందుకే కాంగ్రెస్, టీడీ పీ, జన సమితి, సీపీఐ పార్టీలు తమ రాజకీయ విభేదాలను పక్కనబెట్టి మహాకూటమిగా ఏర్పడ్డాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మె ల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ నర్సంపేట నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పట్టణంలోని ఎంఏఆర్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం జరిగింది. ఈసందర్భంగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడు తూ ఇటీవల రాజ్యసభ స్థానం ఖాళీగా ఏర్పడితే తెలంగాణ అమరుల తల్లితండ్రులకు ఇవ్వకుండా తన మరదలి కొడుకు అయిన జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు ఇచ్చాడని ధ్వజమెత్తారు. తనకు ఎన్నికల మ్యానిఫెస్టో భగవద్గీతతో సమానమని చెప్పిన కేసీఆర్ ఎన్నికల హామీలను అమలు చేసిన పాపాన పోలేదన్నారు. మళ్లీ మరో కొత్త మ్యానిఫెస్టోతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. మహాకూటమి పొత్తులో భాగంగా నర్సంపేట సీటు కాంగ్రెస్, టీడీపీలలో ఎవరికి దక్కినా ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాల ని కోరారు. మహాకూటమి అభ్యర్థికి ఎవరు సహకరించకున్నా ఈ ప్రాంత అభివృద్దిని అడ్డుకున్న వారే అవుతారని అన్నారు. సివిల్ సప్లయ్ చైర్మన్‌గా ఉన్న పెద్ది సుదర్శన్‌రెడ్డి తమిళనాడు రాష్ట్రానికి బియ్యం పంపి కమీషన్ కింద రూ.12కోట్లు దండుకున్నారని, ఆ డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ప్రజలంతా నీతి, నిజాయితీతో ఆలోచించి టీఆర్‌ఎస్ నాయకుల మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. కేసీఆర్ జట్టులో నుండి పెద్ది సుదర్శన్‌రెడ్డి వచ్చారని, ఉదయం మాట మధ్యాహ్నాం ఉండదని, సాయంత్రం మాట రాత్రి ఉండదని, రోజుకో మాటతో పబ్బం గడుపుకుం టూ అందరిని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ జీఓలు, ప్రొసీడింగ్స్ అంటూ మోసం చేస్తున్నారని, ఈ జీఓలు, ప్రొసీడింగ్స్‌కు చట్టబద్దత లేదన్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి నాలుగేళ్ల మూడు నెలలలో కాలంలో నియోజకవర్గ ప్రజలకు 30 పైచీలుకు వాగ్దానాలు చేసి, ఏ ఒక్క వాగ్ధానాన్ని అమలు చేయలేదని, ప్రజలంతా ఆలోచించాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ నియోజకవర్గ నాయకులు జాటోతు సంతోష్‌నాయ క్, ఎర్ర యాకూబ్‌రెడ్డి, అజ్మీరా శ్రీనివాస్, వేముల బొందయ్యగౌడ్, చుక్క రమేష్, తూనం స్వామి, అల్లి నరేందర్‌రెడ్డి, మామిండ్ల మోహన్‌రెడ్డి, వేజెళ్ల ఉమామహేశ్వర్‌రావు, సంపత్, అనె్నం నిర్మల, దరావతు సుభాష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మహాకూటమి కాదు.. విష కూటమి..
* టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే ప్రగతి సాధ్యం
* టీఆర్‌ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట, అక్టోబర్ 16: మహాకూటమి అంతా విషకూటమి అని, ఆ కూటమి అభ్యర్థిని తరిమికొట్టాలని రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్, టీఆర్‌ఎస్ నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆరె సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నర్సంపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఆశీర్వాధ సభకు పెద్ది ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆరె కులస్థులు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని, చాలా మంది పేదలేనని తెలిపారు. ఆరె కులస్థులకు ఓబీ సీ సర్ట్ఫికెట్లు జారీ అయ్యే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు. టీఆర్‌ఎస్‌తోనే ప్రగతి సాధ్యమని, త్వరలో జరిగే ఎన్నికలలో తనకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే నర్సంపేట నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం నాయకులు రాష్ట్ర ఆగ్రోస్ సంస్థ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, రైతు రుణ విమోచన కమీషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్‌రావు, రాష్ట్ర నాయకుడు కల్వల ఆనందరావు, చెట్టుపల్లి శివాజీ, పాలెపు రాజేశ్వర్‌రావు, మనోహర్, శివాజీ, రాజేశ్వర్‌రావు, హన్మంతు, వీరన్న, సాంబశివరావు, దుగ్గొండి జడ్పీటీసీ సుకినె రజిత రాజేశ్వర్‌రావు, నారక్కపేట సర్పంచ్ మోర్తాల రామారావు తదితరులు పాల్గొన్నారు.