వరంగల్

పరకాల బీజేపీ అభ్యర్థిగా డా. విజయచంథర్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, అక్టోబర్ 21: అధికార, విపక్షాలకు ప్రత్యామ్నాయంగా తమకు అవకాశం కల్పించాలనే నినాదంతో ప్రజల్లోకి వెళుతున్న భారతీయ జనతా పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. అందులో వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం నుండి బిజేపి అభ్యర్థిగా డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి పేరును ఖరారు చేస్తూ జాబితాను విడుదల చేశారు.

*డాక్టర్ విజయచందర్‌రెడ్డి నేపథ్యమిది...
డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి ప్రస్తుతం బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. 2012లో భారతీయ జనతా పార్టీలో చేరి పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎంబీబీఎస్, ఎంఎస్, డిఎన్‌బీ అర్థోపెడిక్‌గా చదవి అర్థోపెడిక్‌కు సంబందించి ఎన్నో ఆపరేషన్లు పూర్తి చేశారు. పెసరు విజయచందర్‌రెడ్డి 1983లోనే ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తండ్రి పేరు సూర్యప్రకాశ్‌రెడ్డి ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో రిటైర్డ్, తల్లి ప్రమీలాదేవి గృహిని, తమ్ముడు జయందర్‌రెడ్డి, భార్య పేరు సుదేశన్, కూతురు నిఖిల ఎంబీబీఎస్, గైనకాలజిస్టు, కుమారుడు నితిన్‌చందర్ ఎంబీబీఎస్‌లు ఉన్నారు.

చీదరించుకున్నా వస్తున్నారు
* చల్లా ధర్మారెడ్డి
పరకాల, అక్టోబర్ 21: తూర్పు ప్రజలు చీదరించుకుంటే శనిలా పరకాల నియోజకవర్గానికి వస్తున్నారని వారిని ఓడించి వారి రాజకీయాలకు చరమగీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం పరకాల పట్టణంలో బైక్ ర్యాలీని చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టికర్తలు పరకాల ప్రజలని చెప్పారు. నాకు నరాలు తెగినాయని తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఇప్పుడు నామీద అభిమానంతో వచ్చిన జనాలను చూస్తే వారికి నరాలు తెగుతాయని చెప్పారు. ఆడపడుచుల పుస్తెలు తెంపి వారి ఉసురు పోసుకున్నారని, వారి గుండా రాజ్యం వద్దు అని పరకాల ప్రజలు వారిని ఓడించారని అన్నారు. అవమానం తట్టుకోలేక వరంగల్ తూర్పు బాట పట్టారని తెలిపారు. తూర్పు ప్రజలు చీదరించుకుంటే మళ్లీ మహాకూటమి అనే పేరుతో మహా శనిలా పరకాల నియోజకవర్గానికి వస్తున్నారని చల్లా పేర్కొన్నారు. వారిని ఓడించి వారి రాజకీయాలకు చరమగీతం పాడాలన్నారు. బుచ్చన్న మీద ఓడి పోయినప్పుడు టీవీలు పగుల గొట్టింది ఎవరో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. శనిని వదిలించుకోవడానికి పూజలు చేసుకుంటామన్నారు. గత ఎన్నికలో కొండాలను పిండి చేయడానికి వస్తే తూర్పుకు పారి పోయారని ఎద్దేవ చేశారు. కేసిఆర్ పరకాల నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి సారించి అధిక నిధులు ఇచ్చారని, నియోజగవర్గ అభివృద్ధికి టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

*శనిని పరకాల నుండి తరిమి కొట్టాలి: నాగుర్ల వెంకటేశ్వర్లు
పరకాల నుండి వదిలిన శని మళ్లీ వస్తోందని శనిని పరకాల పొలిమేరలో నుండే తరిమి తరిమి కొట్టాలని తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు అన్నారు. బైక్ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శని మాయమాటలు నమ్మవద్దని, గతంలో వాళ్లు ఏమి చేశారో మనందరికీ తెలుసన్నారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను చూసి వణికిపోతున్నారన్నారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి మాట్లాడుతూ పరకాల ప్రాంత అభివృద్ధి జరగాలంటే ధర్మారెడ్డి గెలుపు ముఖ్యమని చల్లా ధర్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టితో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పరకాల ఎంపిపి నేతాని సులోచన, శ్రీనివాస్‌రెడ్డి, పరకాల జడ్పిటిసి పాడి కల్పనాదేవి, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ పావుశెట్టి వెంకటేశ్వర్లు, వజ్ర రవికుమార్, దగ్గు విజేందర్, రేగూరి విజయపాల్‌రెడ్డి, బొచ్చు వినయ్ తదితరులు పాల్గొన్నారు.