వరంగల్

పొన్నాల చేసిన పాపమే జనగామకు శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బచ్చన్నపేట, అక్టోబర్ 23: ఆనాడు పొన్నాల లక్ష్మయ్య చేసిన పాపమే నేడు జనగామ నియోజకర్గానికి శాపమైందని జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఎస్వీ గార్డన్‌లో ముత్తిరెడ్డికి గొల్లకురుమల ఆశీర్వాద సభ జరిగింది. ముందుగా చౌరస్తావద్ద ముత్తిరెడ్డికి ఒగ్గుడోలు వాయిద్యాలతో గొల్లకురుమ లు ఘనంగా స్వాగతం పలికారు. సమావేశం స్థలం వరకు వాయిద్యాల, విన్యాసాలతో ర్యాలీగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన సమావేశానికి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పొన్నాల లక్ష్మయ్య భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉండి జనగామ నియోజకవర్గ ప్రజలకు, రైతులకు తీర ద్రోహం చేశాడని ఆరోపించారు. జనగామ పరిసర ఆరు నియోజకవర్గాల కు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరందించే వీలుగా రిజర్వాయర్లు నిర్మించా ల్సి ఉండగా, ఆరిజర్వాయర్లను కుదించి కనీసం లక్ష ఎకరాలకుకూడ నీరందకుం డా చేశాడని ఆరోపించారు. ఈప్రాంతం లో రైతులకు నష్టం జరిగిందంటే పొన్నాల చేసిన పాపం వల్లే అన్నారు. ఆంధ్రనాయకులకు అమ్ముడుపోయి ఇక్కడివన్ని దోచి పెట్టాడాని విమర్శించారు. దీని పరియవ్యసనంగా 386 చెరువులకు గాను 150 చెరువులు గోదావరి నీటితో నింపాల్సి ఉండగా 56 చెరువులు మాత్రమే నింపగలుగుతున్నామని అన్నారు. దీనిక ప్రత్యామ్నాయంగా రూ. 385కోట్లతో మల్లసాగర్ రిజర్వాయర్ నిర్మాణం అవుతుందని దీనితో ఈ ప్రాంతం సస్యశ్యామలం కాబోతుందని చెప్పారు. ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు తగిన బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణనను కాంగ్రెస్ ఇచ్చింది ఏమిలేదని, మనమే పోరాడి సాధించుకున్నామని అన్నారు. తెరాస ను గెలిపించడంలో యువత ముందు కు వచ్చి ప్రజలను చైతన్యపరచాల్సి అవసరం ఉందని పిలుపునిచ్చారు. మండల మాజీ సర్పంచ్‌ల ఫోరం మండలశాఖ అధ్యక్షులు బేజాటి సిద్దులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతుసమన్మయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ రమణారెడ్డి, కొమరవెళ్లి దేవస్థానం చైర్మన్ సంపత్, ఎంపీపీ మహేష్, సమాజిక సేవా కార్యకర్త తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.

24 గంటలూ ప్రజల కోసమే పని చేస్తా..
* స్వతంత్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు
* గండ్ర వర్గంలోకి భారీగా చేరికలు
భూపాలపల్లి అక్టోబర్ 23: పదవి ఉన్నా లేకున్నా 24 గంటలు ప్రజల కోస మే పని చేస్తానని స్వతంత్య్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం ఆయన భూపాలపల్లిలోని పలు భూగర్భ గనులలో, కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించా రు. ఉదయం గనుల వద్ద కార్మికులను కలిసి తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గండ్ర పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి పట్టనం ఎల్‌బీ నగర్ కాలనీకి చెందిన 50 మంది టీజెఎస్‌ఎఫ్ యువజన విభాగం ఉపాధ్యక్షుడు శశి, నిషాంత్, వెంకటేష్‌ల ఆధ్వర్యంలో 50 మంది యువకులు గండ్రకు మద్దతు తెలిపి పార్టీలోకి చేరారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్తన్న మాట్లాడుతూ నియోజకవర్గంలో యువకులు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నారని, వారి రుణ పడి ఉంటానన్నారు. సింగరేణి కార్మికులందరు ఇప్పటికే దనకు మద్దతు ప్రకటించారని వారికి అండగా ఉండి కష్ట సుఖాలలో పాలుపంచుకుంటానన్నారు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజల్లోనే ఉంటానని గండ్ర అన్నారు. భూపాలపల్లి పట్టనంలో కొనసాగుతున్న ప్రచారంలో ప్రజలు తనకు అండగా నిలబడుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్, ఆకుల మహేందర్, నరేష్, సాయినాథ్, అంబాల శ్రీను, రాంనేని రవీందర్,, దాట్ల శ్రీను, తోట సంతోష్, బండి తిరుపతి, ఒద్దుల అశోక్‌రెడ్డి, మహేందర్, రజినీకాంత్, బి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అభ్యర్థిగా చందూలాల్ అర్హుడు కాదు..
ఏటూరునాగారం, అక్టోబర్ 23: రాబోయే ఎన్నికల్లో ములుగు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అజ్మీర చందూలాల్ అర్హుడు కాదని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు అర్రెం నారాయ ణ ఆరోపించారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో నారాయణ మాట్లాడారు. ఓటమి భయంతోనే టిఆర్‌ఎస్ అసమ్మ తి ఆదివాసీ నాయకులైన ఆలం రామ్మూర్తి, తాటి కృష్ణలపై మంత్రి చందూలాల్, మార్కెట్ ఛైర్మన్ ప్రహ్లాద్‌లు దాడులు చేయించారని ఆరోపించారు. ఆదివాసీలకు ఎమ్మెల్యే టిక్కెట్టు కేటాయించాలని డిమాండ్ చేసినందుకు భౌతిక దాడులకు పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గ్రామాల్లోకి ఓట్లకోసం వచ్చే టిఆర్‌ఎస్ అభ్యర్ది, నాయకులపై భౌతిక దాడులకు పాల్పడాలని ఆదివాసీలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్, జిల్లా ఉపాధ్యక్షుడు కబ్బాక శ్రావణ్, మండల అధ్యక్షుడు కాపుల సమ్మయ్య పాల్గొన్నారు.