వరంగల్

ఓటమి భయంతోనే మాపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగుటౌన్, అక్టోబర్23: ఓటమి భయంతోనే మాపై చందూలాల్ అనుచరులు దాడికి పాల్పడ్డారని అసమ్మతి నేతలు అన్నారు. ములుగు డీఎల్‌ఆర్ గార్డెన్స్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసమ్మతి నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా గోవింద్ నాయక్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో మంత్రి చందూలాల్‌తో కలిసి పని చేస్తూ తండ్రి కొడుకుల తీరు నచ్చక చీలిపోయి స్వతంత్రంగా ప్రచారం చేస్తుండగా ఓటమి భయంతోనే నాపై అపద్దర్మ మంత్రి చందూలాల్, అతని కుమారుడు ప్రహ్లాద్ శాంతియుతంగా వెంకటాపురం మండలంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఓర్వలేక అతని అనుచరులు ప్రహ్లాద్ యువసేన, జాగృతి కార్యకర్తలు మా వాహనాలను ధ్వంసం చేసి మాపై దాడి చేయించారన్నారు. చేత కాకుం డా ఇతరుల సహాయంతో నడిచే చందూలాల్ నియోజకవర్గంలో పర్యటించే సందర్భం లేదని కొత్త వారికి ఎవరికి టికెట్టు ఇచ్చిన కలిసికట్టుగా గెలిపిస్తామన్నారు. అనంతరం సకినాల శోభన్ మాట్లాడుతూ అక్రమ సంపాదన కోసమే మంత్రి చందులాల్, ప్రహ్లాద్‌లు పదవుల కోసం పాటుపడుతున్నారని అన్నారు. అసమ్మతి నేతలపై ఉద్దేపూర్వకంగా ఓర్వలేకనే దాడులు చేయించారని, కుట్రలు పన్ని ఎన్ని దాడులు చేసిన వెనుకడుగు వేసేది లేదని అన్నారు. మా పై జరిగిన దాడిని వివరించి ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అలెం రాంమూర్తి, వలిబా బ, రవితేజ, రియాజ్ మిర్జాతదితరులు ఉన్నారు.

డిజిటల్ చెల్లింపులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
* మున్సిపల్ కమిషనర్ గౌతమ్ ఆదేశం
వరంగల్, అక్టోబర్ 23: డిజిటల్ చెల్లింపులపై ప్రత్యేక దృష్టి సారించి పన్నుల చెల్లింపులు జరిపేలా చూడాల్సిన అవసరం రెవెన్యూ సిబ్బందిపై ఉందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వీపీ. గౌతమ్ అన్నారు. మంగళవారం మహానగర పాలక సంస్ధ ప్రధాన కార్యాలయంలో ఆయన ఛాంబర్ ఆర్‌ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినెల రెవెన్యూ సిబ్బంది ఇంటి నెంబర్లు కేటాయించినప్పుడు సమాచారం అంతా టౌన్ ప్లానింగ్ విభాగానికి చేరాలన్నారు. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ డివిజన్లలలో అసెన్‌మెంట్లు, డిమాండ్‌లలో సమతూకం లేదని అలా కాకుండా ఆర్‌ఐలకు ఒక విధమైన అసెన్‌మెంట్ డిమాండ్ ఉండే విధంగా సరిదిద్దాలని ఆయన ఆదేశించారు. బిల్ కలెక్టర్లు తమ డిమాండ్‌లో 50శాతం నగదు రహిత వసూళ్లు జరపడం తప్పనిసరి అని కమిషనర్ అన్నారు. ప్రత్యేకంగా 55 స్వైపింగ్ మిషన్లును సిబ్బందికి అందజేయడం జరుగుతుందన్నారు. దీన్ దయాల్‌నగర్ ప్రాంతంలో ఇంటి నెంబర్లు లేకున్నా వారికి తప్పనిసరిగా నల్లా కనెక్షన్లు కేటాయించాలని, ఈ ప్రక్రియను పర్యేవేక్షించాలని డీసీ ప్రశాంతీని ఆదేశించారు. వరంగల్(అర్బన్) జిల్లాకు సంబంధించిన విలీన గ్రామాలైన మడికొండ, భీమారం వంటి ప్రాంతాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు జరిపేలా ఆర్‌ఐలు తమ వంతు పాత్ర వహించాలనీ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పన్నుల అధికారి శాంతికుమార్, జేఎం ఉమాకాంత్, ఆర్‌ఐ పాల్గొన్నారు.