వరంగల్

మళ్లీ గెలుపు మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్‌ఘన్‌పూర్, అక్టోబర్ 23: డిసెంబర్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలుపు మనదే, ప్రభు త్వ ఏర్పాటు మనదేనని రాష్ట్ర ఐటి శాఖ ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ విస్తృతస్ధాయి సమావేశాన్ని టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టరు తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో స్థానిక విద్యాజ్యోతి ఢిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర ఆపధర్మ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాల సవాల్ మేరకు ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని చూరగొన్న తరుణంలో టిఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం ఖాయమే కాకుండా ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేవారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభివృద్ధి సంక్షేమ పధకాలను గ్రామ, గ్రామాన, గడప, గడపకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. 60 సంవత్సరాల కాలంగా కాంగ్రెసు, తదితర పార్టీలు అధికారంలో ఉన్నప్పటికి ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రంలోనే బలమైన, రాజకీయ చరిత్ర కలిగిన నియోజకవర్గం కేవలం స్టేషన్ ఘన్‌పూర్ మాత్రమేనని ఆయ న అన్నారు. అలాంటి రాజకీయ చైతన్యమే కాకుండా నియోజక వర్గంనుండి అతిరథ మహారథులైన ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ విఫ్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టరు తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అరూరి రమేశ్ ఉండడం అంతకన్నా ఇంకా ఏమీ కావాలన్నారు. ఇలాంటి నియోజకవర్గంలో పోటీ చేయడానికి ప్రతిపక్షాలకు చెమటలు పడుతున్నాయని, అలాంటి ప్రతిపక్షాలకు సరైన బుద్ధి చెప్పడమే కాకుండా డిపాజిట్ రాకుండా కృషి చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులదేనని ఆయన అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలకు తెరలేపడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారిందని, అలాంటి ఎడారిని సస్యశ్యామలం చేసేదిశగా లక్షల కోట్లు వెచ్చించి సాగునీటి ప్రాజెక్టులను తీసుకొస్తుంటే అడ్డుపుల్ల వేయడం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారిందన్నారు. అమ్మపెట్టదూ, అడుక్క తిననీయదనే సామెతను ప్రతిపక్షాలు రుజువు చేసుకుంటున్నాయని ఆయన విమర్శించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం టిఆర్‌ఎస్ పార్టీలో సమ్మతి, అసమ్మతి అంతకన్నా లేదని ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తనకు, పార్టీ అభ్యర్ధి డాక్టరు రాజ య్య మధ్యలో ఎలాంటి విబేధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టరు రాజయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించడమే తన ఏకైక లక్ష్యమన్నారు. తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ నాయకత్వంలో కలిసి పని చేస్తామన్నారు. నియోజకవర్గంలో మహాకూటమిని తరిమికొట్టే విధంగా ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నాయకులు, కార్యకర్తలు ఒత్తిడి తెచ్చిన విషయం వాస్తమేనని, అందుకు నేనెప్పుడు వారికి హామీ ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యుడు బండాప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, మేయర్ నరేందర్, ఘన్‌పూర్ పార్టీ ఇన్‌చార్జీ మాలోతు కవిత, వివిధ సంస్ధల చైర్మెన్‌లు వాసుదేవరెడ్డి, కిషన్‌రావు, గాంధీనాయక్, నాయకులు కృష్ణారెడ్డి, నరేందర్‌రెడి పాల్గొన్నారు.