వరంగల్

కోదండకు ఇస్తే గాంధీభవన్ రావణకాష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బచ్చన్నపేట, నవంబర్ 13: జనగామ కాంగ్రెస్ టికెట్ భగీరధ పొన్నాలకు కాదని కోదండరాంరెడ్డికి కేటాయిస్తే గాంధీభవన్ ముట్టడించి రావణకాష్టంగా మారుస్తామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కంచెరాములు, బచ్చన్నపేట ఇన్‌ఛార్జీ ఆకుల వేణుగోపాల్‌లు స్పష్టంచేశారు. మంగళవారం బచ్చన్నపేట మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిడిగొండ శ్రీనివాస్ అధ్యక్షతన ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ జనగామ టికెట్ పొన్నాల లక్ష్మయ్యకు కాకుండా, తొలి జాబితాలో ప్రకటించకపోవడంపై జనగామలోని ముఖ్యనాయకులు, కార్యకర్తల నిరసన సెగలు తగిలాయన్నారు. ఇప్పటికే 10వేల మంది కి పైగా రాజీనామాలను చేసి అధికార పార్టీ అధినేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అందచేస్తామన్నారు. మహాకూటమి పొత్తులో భాగంగా అగ్రవర్ణాలు కలిసి చేసిన కుట్రల భాగమేనన్నారు. పొన్నాల గెలిస్తే బీసీ నుండి సీ ఎంకు పోటీకి వస్తారనే నేపంతోనే టికెట్ కేటాయింపులో నిర్లక్ష్యం జాప్యం చేస్తున్నారన్నారు. టికెట్ పొన్నాలకు కాదని ఎవ్వరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముకుమ్మడి రాజీనామాలకు సిద్దం చేశామని గంగం బుచ్చిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం లో మండల కార్యదర్శి బుచ్చిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుర్రపు బాలరాజు, జిల్లా నాయకులు సిద్దిరాంరెడ్డి, క్రాంతికుమార్, జ్యోతిభాస్కర్, అజీం, రాజులు పాల్గొన్నారు.