వరంగల్

చంద్రబాబు కొత్తగా కూడగట్టేది ఏమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, నవంబర్ 13: దేశం లో కాంగ్రెస్ కూటమి ఉందని, అది బిజేపీ యేతర కూటమియే అని చం ద్రబాబు కొత్తగా కూడగట్టాల్సిన కూటములు ఏమీ లేవని, తెలంగాణ లో జరుగుతున్న ఎన్నికల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండా ప్రకాష్ ఆరోపించారు. మంగళవారం హన్మకొండలోని హరిత కాకతీయలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు అనేక నాటకాలు ఆడుతారని తెలిపారు. దేశమంతా తిరిగి తానే దో కొత్త సమీకరణలు చేస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నాడని, కాని గత ఆగస్టు నెలలోనే జరిగిన రాజ్యసభ డిప్యూటి స్పీకర్ పదవికి ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీతో ఆం ధ్రాకు లాభం అని చెప్పి, ఇపుడు మా ట మార్చి ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వలేదని కేంద్రాన్ని నిందిస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రచారానికి వచ్చనపుడు ఆంధ్రాలో కలిపిన ఏడు మండలాలను తిరిగి ఇస్తామని, సీలేరు ప్రాజెక్టుపై హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పార్టీలోని సీనియర్ నాయకులకే అతిగతి లేకుండా పోయిందని, తెలుగుదేశం నాయకుడు రేవూరికి దిక్కులేక వరంగల్ పశ్చిమకు వచ్చి పోటీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కోదండరాం కూడా మూడు, నాలుగు సీట్ల కోసం ఆంధ్రాపార్టీల పక్కకు చేయడం దురదృష్టకరమని అన్నారు. 1983 తర్వాత 3 సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎపుడు 60 సీట్లు గెలవలేదని గుర్తుచేశారు. తెరాసకు ప్రజాబలం ఉందని 100 శాసనసభా స్థానాలను గెలిచి తెలంగాణలో మరో రికార్డు సృష్టించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాయకులు రాజయ్య యాదవ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.