వరంగల్

చిల్లర రాజకీయాలు మానుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రఘునాథపల్లి, నవంబర్ 14: త్వర లో జరగబోయే ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌లో మహాకూటమి గెలుపు ఖాయమని, టీఆర్‌ఎస్ అభ్యర్థి డా. తాటికొండ రాజయ్య నియోజకవర్గంలో ఆసుపత్రి పెట్టడం జరుగుతుందని స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిర అన్నారు. బుధవా రం మండల కేంద్రంలో కాంగ్రెస్ పునర్ణిర్మాణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీనియర్ నాయకుడు లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా ఆమె పాల్గొని మాట్లాడా రు. స్టేషన్‌ఘన్‌పూర్ అభ్యర్థి డా. రాజ య్య చిల్లర రాజకీయాలు చేస్తే బం డారం భయటపడుతుందని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు ఆరుద్రపురుగులైతే.. టీఆర్‌ఎస్ నాయకులు భరిజెనిగలు అని ఆమె అన్నారు. గతంలో కడియం కావ్య స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం కాదని, గుంటు రు అన్న రాజయ్య నీది స్టేషన్‌ఘన్‌పూరా.. హన్మకొండనా..? అని ప్రశ్నించారు. నన్ను హైదరాబాద్ వాసి అని విమర్శించడం సరికాదని, నాది స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గమేనని అన్నా రు. మంత్రి కేటీఆర్ నేరెళ్లలో దళితులపై తర్డ్ డిగ్రీ ఉపయోగించి జైలుకు పంపిన ఘనతను మరిచి స్టేషన్‌ఘన్‌పూర్‌కు వచ్చి రాజయ్యకు భరోసా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని టీఆర్‌ఎస్‌కు డిపాజిట్ కూడా దక్కదని ఆమె అన్నారు. టీఆర్‌ఎస్ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఎక్కడికి వెళ్ళినా తిరుగుబాటే ఎదురవుతుందని, ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని ఆమె అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ప్రజ లు ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఆమె తెలిపారు. అనంతరం ఇతర పార్టీలకు చెం దిన నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు సమ్మయ్యయాదవ్, నాయకులు జయపాల్‌రెడ్డి, సీహెచ్. బిక్షపతి, జయరాములు, పుల్లయ్య, వెంకటేశ్వర్‌రెడ్డి, లింగాజీ, రామమూర్తి, మల్లేషం, విజయమేరీ, చందన, యాదవరెడ్డి, ఉమలు పాల్గొన్నారు.

19న కార్యచరణ ప్రకటిస్తా: గన్నోజు
పరకాల, నవంబర్ 14: పోత్తులో భాగంగా పరకాల సిట్టింగ్ స్థానం ఇస్తామని చెప్పి టిడిపికి ఇవ్వకపోవడం బాధకరమని టిడిపి జిల్లా అధ్యక్షులు గన్నోజు శ్రీనివాసాచారి అన్నారు. బుధవారం పరకాల పట్టణంలోని ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గన్నోజు శ్రీనివాసాచారి మాట్లాడుతూ పరకాల అసెంబ్లీ సెగ్మంట్ స్థానం టిడిపిదన్నారు. పరకాల సెగ్మంట్ నుండి టిడిపి పార్టీ నుండి గెలిచిన చల్లా ధర్మారెడ్డి పార్టీ మారి టిఆర్‌ఎస్‌కు వెళ్లిన నాటి నుండి నేటి వరకు పరకాల నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉన్నానని చెప్పారు. పరకాల నియోజకవర్గంలో 12వేల 360 సభ్యత్వాలు నమోదు చేసి తెలంగాణ రాష్ట్రంలోనే సభ్యత్వాల నమోదులో పరకాలను మూడవ స్థానంలో నిలబెట్టినట్లు తెలిపారు. పరకాల నియోజకవర్గంలో 20వేలకు పైగా టిడిపి శ్రేణులు ఉన్నారని చెప్పారు. స్థానికైతురుడైన చల్లా ధర్మారెడ్డి అవినీతిపై అలుపెరుగని పోరాటం చేశానని తెలిపారు. టిడిపి నుండి గెలిచి టిఆర్‌ఎస్‌లోకి వెళ్లిన చల్లా ధర్మారెడ్డి బినామి కాంట్రాక్ట్ పనులు చేస్తు పరకాల నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల పేరుతో దొచుకున్నాడని తెలిపారు. అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. అయితే కార్యకర్తలు, నాయకుల ఒత్తిడి మేరకు ఈనెల 19న కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తన కార్యచరణ ప్రకటిస్తానని తెలిపారు. సమావేశంలో పరకాల టిడిపి పట్టణ అధ్యక్షులు కొలుగూరి రాజేశ్వర్‌రావు, జిల్లా ఉపాధ్యక్షులు తోట రవీందర్ తదితరులు పాల్గొన్నారు.