వరంగల్

నామినేషన్ వేసిన తాటికొండ రాజయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్‌ఘన్‌పూర్, నవంబర్ 14: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ(99) శాసనసభ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్ధి డాక్టరు తాటికొండ రాజయ్య బుధవారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి రమేశ్‌కు సమర్పించారు. రాష్ట్ర ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో కలిసి నియోజకవర్గ ఎన్నికల కార్యాలయానికి చేరుకున్న డాక్టరు రాజయ్య వారి సమక్షంలో తన నామినేషన్ పత్రాలను ఆర్‌ఓకు సమర్పించారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుం డా కేవలం ఐదుగురు వ్యక్తులతోనే నామినేషన్ వేశారు.

కొండ దంపతుల నాయకత్వం పరకాలకు అవసరం లేదు
*తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ లింగంపెల్లి కిషన్‌రావు
పరకాల, నవంబర్ 14: కొండా సురేఖకు ఎమ్మెల్యే, కొండ మురళీకి ఎమ్మె ల్సీ పదవి ఇచ్చి అభివృద్ధి పనులకు కోట్లాది నిధులు మంజూరు చేశారని, అలాంటి కేసీఆర్, కేటీఆర్ మీద విమర్శించే అర్హత మీకు లేదని, పరకాలకు మీలాంటి నాయకత్వం అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ లిం గంపల్లి కిషన్‌రావు ఎద్దేవ చేశారు. బుధవారం పరకాల మండలం నర్సక్కపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లింగంపల్లి కిషన్‌రావు మాట్లాడుతూ జాతీయ కాంగ్రెస్ నేతలు చంద్రబాబు కాళ్ల వద్ద మొకరిల్లడం సిగ్గుచేటు అన్నారు. సిపిఐ పార్టీ మూడు సీట్లకు సిరిపెట్టుకోవడం పట్ల ఆయన ఎద్దేవ చేశారు. ఆంధ్రబాబు చంద్రబాబునాయుడిని టిఆర్‌ఎస్ పార్టీ అమరావతికి తరిమి కొట్టిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడ్డు తగులుతు నిధులకు, నీళ్లకు అడ్డుపడుతు ప్రాజెక్ట్‌లను ఆపిన బాబుతో జత కలవడం సిగ్గుచేటు అన్నారు. మహాకూటమి దొంగల కూటమి అన్నారు. కొండా సురేఖ వరంగల్‌లో పోటీ చేస్తే డిపాజిట్ రాదని తెలిసి పరకాలలో పోటీ చేస్తున్నారని ఎద్దేవ చేశారు. మనుకోట సంఘటన ఇప్పటికి మరువలేదని, పరకాలకు ఏమి చేశారని ప్రశ్నించారు. మహాకూటమి నాయకులను చిత్తుచిత్తుగా ఓడించాలని, కేసిఆర్‌ను నిండు మనస్సుతో అశ్వీరదించాలని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆరోగ్యం, రవిందర్, బొచ్చు కర్ణాకర్, తెలంగాణ కుమా ర్, సారంగపాణి, సమ్మయ్య, బీరన్నయాదవ్, వెంకటస్వామి, బండి రవిందర్, బట్టు రవి తదితరులు పాల్గొన్నారు.