వరంగల్

ప్రజల ఆశీస్సులే గెలిపిస్తాయి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, నవంబర్ 14: డోర్నకల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులే తనను గెలిపిస్తాయని.. నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు మరో అవకాశాన్ని ప్రజలు తనకు అందిస్తారని డోర్నకల్ తెరాస అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ధీమా వ్యక్తం చేశారు. మరిపెడ మండలకేంద్రంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం రెడ్యానాయక్ తన నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు కురవి మండలకేంద్రంలోని శ్రీవీరభద్రస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి మరిపెడకు చేరుకొని మాజీ ఎమ్మె ల్యే సత్యవతిరాథోడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు తెరాస నాయకులు రామసహాయం రంగారెడ్డిలను వెంటతీసుకొని రిటర్నింగ్ అధికారి చాం బర్‌కు చెరుకున్నారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, తొర్రూరు ఆర్డివో ఈశ్వరయ్యకు అందజేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. డోర్నకల్ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో భారీ అధిక్యతతో టీఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయం అన్నారు. ఎమ్మెల్యేగా ఐదు పర్యాయాలు డోర్నకల్ నియోజకవర్గంలో విజయం సాధించిన తాను చేసిన అభివృద్దే నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కనిపిస్తుందన్నారు. డోర్నకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు వచ్చే ప్రభుత్వంలో తాను మరింత శ్రమించి పనిచేస్తామని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు ఈరోజు నుండి ఒక్కనిమిషం కూడా వృధా చేయకుండా ఇంటింటికి వెళ్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగున్నర సంవత్సర కాలంలో సాదించిన అభివృద్ధిని వివరించాల్సిన అవసరం ఉందన్నారు. అతి విశ్వాసానికి పోకుండా ప్రతి ఒక్కరు అవిశ్రాంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస యువజన విభాగం ఇన్‌చార్జ్ డీఎస్ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సత్యవతిరాథోడ్, మాలోతు కవిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ న్ గుడిపూడి నవీన్‌రావులు, నాయకులు రామసహాయం రంగారెడ్డి, కుడితి మహేందర్‌రెడ్డి, రామసహాయం సత్యనారాయణరెడ్డి, బానోత్ రాంలాల్, గుగులోతు వెం కన్న, నూకల వేణుగోపాల్‌రెడ్డి, ఎర్రంరెడ్డి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ కంచుకోట డోర్నకల్

డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రునాయక్
డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటిదని.. ఈ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్‌ను తమ గుండెల్లో దాచుకొని కాపాడుకుంటున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని డోర్నకల్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధి జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. కురవిలోని శ్రీవీరభద్రస్వామి వారి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మరిపెడకు చేరుకొని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, వంటికొమ్ము యుగేందర్‌రెడ్డిలతో కలసి వెళ్లి రాంచంద్రునాయక్ రిటర్నింగ్ అధికారి ఈశ్వరయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీని కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని వదిలివెళ్లిన నాయకులను ఎన్నికల్లో ఓడించాలన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఎన్నో అవకాశాలను కల్పించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెసిందన్నారు. అయినప్పటికి స్వార్ద ప్రయోజనాల కోసం కన్నతల్లిలాంటి కాంగ్రెస్‌పార్టీని వదిలి అధికారపార్టీలోకి వెళ్లిపోయారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తులను ఓడించడం ద్వారా గుణపాఠం నేర్పాలని రాంచంద్రునాయక్ కోరారు. మాటల గారడితో ప్రజలను మోసం చేసిన టీఆర్‌ఎస్‌ను ఈ రాష్ట్రం నుండి తరిమికొట్టడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని, డోర్నకల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని, రైతన్నలు పండించిన పంటకు గిట్టుబాట ధర అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అంతేగాక రాష్ట్రంలోని అన్ని వర్గాలను అభివృద్ధి చేసే దిశగా పాలన సాగిస్తామని ప్రకటించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో కొప్పుల వెంకట్‌రెడ్డి, అంబటి వీరభద్రం, కొండపల్లి శ్రీధేవి తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ అధికారం టీఆర్‌ఎస్‌దే: ముత్తిరెడ్డి
జనగామ టౌన్, నవంబర్ 14: కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌లే కాకా మరెన్ని పార్టీలు మాయకూటమిల రూపంలో కలిసి వచ్చినా ప్రజలను నమ్మించలేరని.. మళ్లీ వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని జనగామ టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని దమ్ముధైర్యం ఎవ్వరికీ లేదని అన్నారు. తమ నామినేషన్ పత్రాలను బుధవారం జనగామ ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సీహెచ్. మధుమోహన్‌కు అందచేశారు. ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ కన్వినర్ జీ.సంపత్‌రెడ్డి, నాయకులు పసుల ఏబెల్, అన్వర్ శరీఫ్‌లతో కలిసి ఆయన తమ నామినేషన్ పత్రాలను అధికారికి సమర్పించారు. అనంతరం అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవడమేకాక ఆయన అమలుచేస్తున్న విధానాలకు దేశప్రధానే ప్రశంసించాడని అన్నా రు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు బండ యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.