వరంగల్

స్వీయ రక్షణ ముఖ్యం: జేసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కలగుట్ట, నవంబర్ 14: సమాజంలో బాలలు, పౌరులు, మహిళల కు ఎన్ని చట్టాలు ఉన్నా స్వీయ రక్షణ ఎంతో అవసరమని, రామాయణ, భారత ఇతిహాసాలు చదివి నైతిక విలువలను పెంపొందించుకోవాలని రూరల్ జాయింట్ కలెక్టర్ మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశమందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నాయ ని, కాని ఆపద, ముప్పు వాటిల్లినపుడు స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి హరిసింగ్, అధికారులు పరశురాములు, శ్రీనివాసరావు, వెంకటరమణ, మంజుల తదితరులు పాల్గొన్నారు.

మాట ఇస్తే నిలబెట్టుకుంటా..
మానుకోట బీజేపీ అభ్యర్ధి హుస్సేన్‌నాయక్
కేసముద్రం, నవంబర్ 14: మాటలు చెప్పి పూట దాటిచ్చుకునేటోన్ని కాదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా.. ఈ ఒక్కసారి నాకు అవకాశమి స్తే.. మానుకోటపై కాషాయజెండా ఎగరేస్తానని బీజేపీ అభ్యర్ధి జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. బుధవారం కేసముద్రం మండలం రాజీవ్‌నగర్, చంద్రుతండా, కేసముద్రం (వి) గ్రామంలో వివిధ పార్టీల నుండి బీజేపీలో చేరిన కార్యకర్తలు, నాయకులకు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వంత నియోజకవర్గానికి సేవ చేయాలనే లక్ష్యంతో ప్రజల ఎజెండాతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తనకు సేవ చేయడమే తెలుసని, కుట్రలు, కుతంత్రాలు తెలియవన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పేదల సంక్షేమానికి నిధులు ఇస్తుంటే ఇక్కడ టీఆర్‌ఎస్ ప్రభుత్వం తాను ఇస్తున్నట్లు ప్రకటించుకుంటూ పబ్బం గడుపుతోందని ఆరోపించారు. పేదలకు నిలువ నీడ కల్పించాలనే లక్ష్యంతో వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సత్యనారాయణ, బొట్టు రమేష్, మల్యాల రాములు, శోభన్‌నాయక్, రమేష్, సంపత్, కిషోర్, యాకూబ్, ఖాసీం పాల్గొన్నారు.