వరంగల్

కమ్యూనిస్టుల కోటాలోనే పాగా వేసినోన్ని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 14: ఒకప్పుడు కమ్యూనిస్టులకు పెట్టని కోటగా ఉన్నా నర్సంపేటలో మొదటిసారిగా టీడీపీ జెండా ఎగరేసిన ఘనత నాదని, అప్పుడు అక్కడి ప్రజలు మార్పు కోరుకునే తనకు పట్టం కట్టారని ఇప్పుడు కూడా వరంగల్ పశ్చిమలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మహాకూటమి టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. బుధవారం హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నాలుగున్నా ర సంవత్సరాలుగా ప్రజలు టీఆర్‌ఎస్ పాలనను చూశారని, కుటుంబం పాలనతో ప్రజ లు విసుగుచెందారని అన్నారు. కుటుంబ పాలన అంతమెందించేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పాటై ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ దేశంలో బీజేపీ ప్రజాస్వామాన్ని కూనీ చేస్తున్నారని అన్నారు. సిద్దాంతపరమైన వైశమ్యాలను పక్కకు పెట్టి 37 ఏళ్ల వైరాగ్యం వీడి కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందని మనలో మనకు విభేదాలు వస్తే టీఆర్‌ఎస్ లబ్ధి పొందాలని చూస్తుందని తెరాస శ్రేణులు అర్ధం చేసుకుని తెలుగుదేశం పార్టీకి సహకరించాలని ప్రకాశ్‌రెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీ పూర్వ జిల్లా అధ్యక్షుడిగా నాయిని రాజేందర్‌రెడ్డిగారు చాల కష్టపడ్డారని తనకు టిక్కెట్టు రాకపోవడం బాధగానే ఉంటుందని రాజేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సరైన అవకాశాలు ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి ఒప్పించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని అదే విధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వాలను కూడా కోరుతునట్లు ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పశ్చిమ సీటును తాను అడగలేదని పూర్వ వరంగల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నాలుగు సీట్లు నర్సంపేట పరకాల, మహాబూబాబాద్, వరంగల్ ఈస్ట్ అడిగామని చివరికి రెండు స్ధానాల్లోనైనా ఇస్తారని ఆశించామని కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి తనకు కేటాయించారని అన్నారు. ప్రజా కూటమిని బ్రతికించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాటోతు సంతోష్ నాయక్, సయ్యద్ మన్సూర్ హుస్సేన్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్యారాషూట్ నాయకుల భరతం పట్టాలి
*ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి కడియం పిలుపు
స్టేషన్‌ఘన్‌పూర్, నవంబర్ 14: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందుకుసాగాలని రాష్ట్ర ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధి డాక్టరు తాటికొండ రాజయ్య నామినేషన్ కార్యక్రమానికి బుధవారం ప్రభుత్వ విఫ్ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి హాజరైనారు. ఈసందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అభ్యర్ధి డాక్టరు రాజయ్య ను అత్యధిక మెజారిటీతో గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాల ని ఆయన కోరారు. మహాకూటమిలో ప్యారాషూట్ నాయకులు కేవ లం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో అడుగు పెడుతున్నారని, ఎన్నికల్లో అలాంటి నాయకుల భరతం పట్టేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు కంకణ బద్ధులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధికి త్రిమూర్తులమైన తాను, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాటికొండ రాజయ్యలము ఉన్నామని ప్రజలు ఎలాంటి అనుమానాలకు పోవద్దని ఆయన అన్నారు. వర్గాల తారతమ్యం లేకుండా అందరూ టిఆర్‌ఎస్ అభ్యర్ధి విజయానికి కృషి చేయాలన్నారు. నాపై పార్టీ శ్రేణులకు ఏమాత్రం అభిమానం ఉన్నా పూర్తి స్థాయిలో రాజయ్య విజయానికి కృషి చేసినపుడే నాపై గౌరవం ఉన్నట్లు భావిస్తానని తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఏడు రిజర్వాయర్లను గోదావరి జలాలతో నింపడం జరిగిందన్నారు. అక్కడక్కడా కొంత మంది రైతులకు సాగునీరు అందకపోవడం నిజమేనని, రానున్న మూడు సంవత్సరాల కాలంలో లింగంపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు రెండుపంటలకు సాగునీరు అందించే బాధ్యత తనదేనని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తారని తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. కార్యక్రమంలో ఘన్‌పూర్, రఘునాధ్‌పల్లి, ధర్మసాగర్, జఫర్‌గడ్, లింగాలఘనపురం జడ్పిటిసిలు భూక్యా స్వామినాయక్, శారద, కీర్తి వెంకటేశ్వర్లు, అరుణశ్రీరాజేశ్‌నాయక్, రంజిత్‌రెడ్డి, ఎంపిపి జగన్మోహన్‌రెడ్డి, సీనియర్ నాయకులు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, ఆకుల కుమార్, రాంబాబు, పోగుల సారంగపాణి, ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పేదలకు భరోసా కల్పించడమే లక్ష్యం
*మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
కాటారం, నవంబర్ 14: పేద ప్రజల కు రక్షణ, సంక్షేమ రంగాలలో భరోసా కల్పించడమే తమ లక్ష్యమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నా రు. బుధవారం కాటారం మండలంలోని దేవరాంపల్లిలో జరిగిన కార్యక్రమం లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం అక్కడ సుమా రు వంద మంది పలు పార్టీలకు చెంది న కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరా రు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని, మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. అనేక సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలను రెండు కండ్లలాగా భావించి, తాము తమ తల్లి పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాల ను చేపట్టి అందరికి అన్ని రకాల సదుపాయాలను కల్పించడం జరిగిందని పుట్ట మధూకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ మోసపూరిత వాగ్థానాలతో ప్రజల ముందుకు వస్తున్నారని, వాస్తవంగా ప్రజలకు సేవ చేసిన వారికే ఓటు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తెరాస పార్టీ అధ్యక్షుడు సంతోషం శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ చల్ల నారాయణ రెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి భూపెల్లి రాజు, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు జావిద్ ఖాన్, మహిళ విభాగం అధ్యక్షురాలు అయిత శకుంతల తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు
* టీడీపీ రాష్ట్ర కార్యదర్శ గట్టు ప్రసాద్‌బాబు
జనగామ టౌన్, నవంబర్ 14: నాలుగేళ్ల పాటు రాష్ట్రాన్ని దివాలా తీయించిన టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని టీడీపీ రాష్ట్ర కార్యినిర్వాహక కార్యదర్శి గట్టు ప్రసాద్‌బాబు అన్నారు. జనగామ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజాధనాన్నంతా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ను ఓడించి మహాకూటమిని అధికారంలోకి తీసుకురావడానికి అన్నివర్గాల ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. జనగామకు రింగురోడ్డు ఏమయిందని ప్రశ్నించారు. జిల్లాను పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతానని తెలపిన మాటలు గాలికి వదిలేశారని విమర్శించారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఊసేలేదని, ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రం అడ్రసే లేదని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎలికట్టె మహేందర్‌గౌడ్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బైరుబాబు, జిల్లా నాయకులు మైసయ్య, నవీన్, చోటేమియ, మాజీ ఎంపీటీసీ గోసంగి కిష్టయ్య, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు సురుగుసతీష్, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు జనగాం వృక్కోదర్‌రెడ్డి పాల్గొన్నారు.