వరంగల్

రెండో జాబితాలోనూ ‘పొన్నా’లకు మొండిచేయి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, నవంబర్ 15: గత 35సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో సీ నియర్ నాయకునిగా పనిచేస్తున్న టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు ఏఐసీసీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పేరు లేకపోవడంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు సిద్దమవుతున్నారు. పొన్నాల లక్ష్మయ్య మూడున్నర ద శాబ్దాల కాలంలో నాలుగుసార్లు కీలక మంత్రి పదవులు నిర్వహించడమే కాకా రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయడానికి కృషి చేసినప్పటికీ అధిష్టానం గుర్తించకపోవడం బాధాకరమని సీనియర్ పార్టీ నాయకుడు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీ నాయకుడిగా రాష్ట్రంలోనే కాకాదేశంలో పేరు తెచ్చుకున్న ఆయనపై ఇంత కక్ష సాధింపునకు పూనుకోవడం పార్టీకే నష్టమవుతుందని సీనియర్ నాయకులు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులకు ఆయనే సీట్లు ఇచ్చాడని, ఈ సారి ఆయనకు తప్పనిసరి మొదటి జాబితాలోనే పేరు వస్తుందని సంబరపడిన నాయకులకు నిరాశే ఎదురైంది. అధిష్టానం ప్రకటించిన మొదటి లీస్టులోని 65మందిలో రెండవ జాబితా ప్రకటించిన 10మందిలో తమ నాయకుడి పేరేలేకపోవడంపై జనగామ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులే కాకా ఉమ్మడి జిల్లాలకు సంబందించిన బీసీ నాయకులు కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గత మూడునాలుగు రోజులుగా వౌనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలకు సిద్దమవుతున్నారు. మొదటి రోజే ఏదో ఒక రకమైన నిరసన కార్యక్రమం చేస్తామని ప్రకటించడంతో పొన్నాల లక్ష్మయ్య వారిని బుజ్జగించి ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయవద్దని తెలిపారు. తమకే సీటు వస్తుందని ధీమాగా ఉన్న ఆయన రెండవ లీస్టులోనూ రాకపోవడంతో కార్యకర్తల్లోనూ ఆందోళన మొదలైంది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామగ్రమాన నిరసన కార్యక్రమానికి సిద్దమవుతున్నారు. స్థానిక జిల్లా కార్యాలయాల ఎదుట అర్ధనగ్నంగా కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. తమ నాయకుడికి అన్యాయం చేయవద్దని ఇప్పటికైనా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని ఫ్లకార్డులు పట్టుకొని కార్యాలయం ఎదుట నోళ్ళకు నల్ల రిబ్బన్‌లు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అన్వర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ధర్మపూరి శ్రీనివాస్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సంపత్ నాయక్, నాయకులు బక్క శ్రీనివాస్, చింతకింది మల్లేషం, శ్రీనివాస్, కర్రె కృష్ణ, రఘుఠాగూర్, మంద వెంకటనర్సయ్య, జమాల్‌లు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు సాగాలంటే
టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి
* ఇంటింటి ప్రచారంలో సిరికొండ
రేగొండ, నవంబర్ 15: తెలంగాణ సంక్షేమ పథకాలు కొనసాలంటే తెరాసను గెలిపించాలని భూపాలపల్లి తెరాస అభ్యర్ధి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి అన్నారు. గురువారం మండలంలోని రామగుండం, జగ్గయ్యపేట, సుల్తాన్‌పూర్, వెంకటేశ్వరపల్లి, కొనారావుపేట, గాంధీనగర్, నిజాంపల్లి. గొరికొత్తపల్లి గ్రామాల్లో సిరికొండ మధుసూధనాచారి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పనిచేసిందని అన్నారు. అభివృద్ధి సంక్షేమం అగి పొవద్దంటే తిరిగి తెరాసనే గెలిపించాలని అన్నా. నాలుగున్నార సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ప్రజలు కళ్ల ముందు కనబడుతుందన్నారు. గత పాలకులు చేసిన అభివృద్ధిని బేరుజు వేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజలు చూడాలని గత 70 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతం ఎలా ఉంది. ఇప్పుడు ఎలా ఉందో చూసి తెరాసకు ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సాంబరి సమ్మరావు, మండల అధ్యక్షుడు ఉమేష్‌గౌడ్, మైస బిక్షపతి పాల్గొన్నారు.