వరంగల్

కూలీ మాది.. జీతాలు ఇంకొకరికా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్‌ఘన్‌పూర్, నవంబర్ 15: నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యన్నతికి మాతో కూలీ చేయించుకున్న అధిష్టానం జీతాలు మరొకరికి ఇస్తున్నారని మాజీ మంత్రి విజయరామారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పిసిసి కార్యదర్శి చేపూరి వినోద్ నివాసంలో ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్న విజయరామారావు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన తనతోపాటు మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యం, నాయకులు అమృతారావు, భోనగిరి రవిందర్, మంద రమేశ్, చేపూరి వినోద్‌లను కాదని ప్యారాషూట్ నాయకులకు కాంగ్రెసు టికెట్ ఇవ్వడంపై ఆయన తీవ్రంగా విమర్శించారు. అంతేకాక నియోజకవర్గ స్థాయిలో అభ్యర్ధిత్వాలపై ఎలాంటి పరిశీలన లేకుండా కేవలం డబ్బు సంచులకే విలువనిస్తూ ప్యారాషూట్ నాయకులకు టికెట్లు కట్టబెట్టడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీని చిన్నాభిన్నం చేసేందుకే అధిష్టానం మొగ్గుచూపుతుందని ఆయన ఆరోపించారు. కనీసం అభ్యర్ధిత్వాలపై పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్న ఏఐసీసీ, పీసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియా, స్క్రీనింగ్ కమిటీ మరొక్కసారిపునరాలోచించాలని ఆయన సూచించారు. లేని పక్షంలో తామాంతా నామినేషన్ వేస్తామని ఆయన స్పష్టం చేశారు. అధిష్టానం పునరాలోచించి తనతోపాటు ఆరోగ్యం, వినోద్, రమేశ్, రవిందర్, అమృతారావులకు ఎవరికి టికెట్ ఇచ్చినా అభ్యర్ధి విజయం కోసం కలిసికట్టుగా పనిచేస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.