వరంగల్

వైద్య, విద్యా ప్రమాణాలు పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 15: వైద్య, విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కళాశాలలు కృషి చేయాలని కాళోజి హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.బి కరుణాకర్‌రెడ్డి తెలిపారు. నాణ్యమైన వైద్య విద్యను అందించి ఉత్తమ విద్యార్ధులుగా తీర్చి సమాజానికి అందించాల్సిన బాధ్యత కళాశాలలపై ఉందని పేర్కొన్నారు. యూనివర్సిటీ పారదర్శకంగా సేవలు అందిస్తోందని, యూనివర్సిటీ సిబ్బంది, కళాశాలలు ఎటువంటి అవకతవకలకు పాల్పడిన ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయూష్, నర్సింగ్, ఫీజియోధెరపి, ల్యాబ్ టెక్నిషయన్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో రెండు రోజుల సమావేశాన్ని హన్మకొండలోని అశోక కనె్వన్షన్ హాల్‌లో నిర్వహించారు. విద్యార్ధులకు మెరుగైన విద్యా కళాశాలలో వౌలిక సౌకర్యాలు, బయోమెట్రిక్ హాజరు విధానం, క్లినికల్ ల్యాబ్ సదుపాయం, విద్యార్ధుల సంక్షేమం, నూతన పాఠ్యప్రణాళికపై విస్తృతంగా చర్చించారు. కళాశాలలు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ డా. బీ కరణకర్‌రెడ్డి మాట్లాడుతూ టీచింగ్ ప్రొఫెసర్లు నిబద్ధతతో పనిచేసి విద్యార్ధులకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు. విద్యార్ధులు లేకపోతే కళాశాలలు లేవని, అంతిమంగా విద్యార్ధుల సమగ్ర సంక్షేమమే ధ్యేయంగా కళాశాలలు కృషి చేయాలన్నారు. నాణ్యత లేని వారికి డిగ్రీలు అందిస్తే ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తారు అట్టి చర్యలు ద్వారా సమాజానికి ప్రమాదం అని తెలిపారు. యూనివర్సిటీ 2014 సెప్టెంబర్‌లో స్ధాపించబడిందని, 2016 నుండి కార్యకలాపాలను ఆరంభించిందని తెలిపారు. ఈ రెండేళ్ల కాలంలో ప్రవేశాలు, పరీక్షల నిర్వహణపై దృష్ఠి సారించి పూర్తిగా డిజిటలైజ్ చేశామని తెలిపారు. అవినీతికి తావు లేకుండా యూనివర్సిటీ పారదర్శకంగా పనిచేస్తోందని అన్నారు. డిజిటలైజ్‌లో ఇతర యూనివర్సిటీలు కాళోజి యూనివర్సిటీని ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. యూనివర్సిటీ ప్రతిష్ఠను కాపాడుకోవడంలో కళాశాలలు తమ వంతు సహకారాన్ని అందించాలని వీసీ కోరారు. కళాశాలల్లో పూర్తి స్ధాయి ఫాకల్టీ ల్యాబ్, ఇతర వౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని ఇక నుండి కళాశాలల పనితీరుపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. ప్రత్యేక తనిఖీలు చేపట్టి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని వీసి హెచ్చరించారు. తరగతులకు హాజరు కాని విద్యార్ధులను పరీక్షలకు అనుమతించరాదని ఆయన స్పష్టం చేశారు. అన్ని కళాశాలల్లో బయో మెట్రిక్ హాజరు విధానాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కళాశాలలు ఏకీ కృత ప్రవేశ రుసుమును అమలు చేయాలని, అదే విధంగా విశ్వవిద్యాలయం పేరిట ఎటు వంటి రుసుములను విద్యార్ధుల నుండి వసూలు చేయవద్దని పేర్కొన్నారు. మెరుగైన విద్యార్ధులకు బంగారు పథకాలు అందించేందుకు నిర్ణయించమని అదే విధంగా ప్రయోగ రంగంలో విద్యార్ధులను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది 10 కోట్ల కార్పస్ నిధులను కేటాయించమని తెలిపారు. అలాగే విద్యార్ధుల సంక్షేమానికి 5కోట్ల కార్పస్ ఫండ్, మరో 20 లక్షల నిధులు సెమినార్లకు కేటాయించినట్లు తెలిపారు. రెక్టార్ డా. టి వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ ప్రవేశాలు, పరీక్షల నిర్వహణలో కళాశాల ప్రిన్సిపాల్స్ పూర్తి సహకారాన్ని అందించాలని తెలిపారు. రిజిస్ట్రార్ ప్రవీన్‌కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీ బలోపేతంలో కళాశాలలు సహకరించాలని అన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎథిక్స్, కౌనె్సలింగ్, ఆర్గాన్ డొనేషన్ తదితర అంశాలతో నూతన పాఠ్య ప్రణాళికను ప్రవేశ పెట్టిందని ఇట్టి నూతన పాఠ్యంశాలపై ప్రొఫెసర్లు అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్. యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వై మల్లేశ్వర్‌ఱ, ఓఎస్‌డీఎస్‌వి సత్యనారాయణ, డీప్యూటీ రిజిస్రార్టు రాజు తదితరులు పాల్గొన్నారు.