వరంగల్

జనగామ రూపురేఖలు మారుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, నవంబర్ 16: రానున్న ఎన్నికల్లో ప్రజలు సీపీఎంకు అవకాశం ఇస్తే జనగామ రూపురేఖలు మారుస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డిఅన్నారు. శుక్రవారం పట్టణంలో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి జిల్లా కమిటి సభ్యురాలు ఇర్రి ఆహల్య అధ్యక్షత వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఉపాధిల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యాయని ఆయన అన్నారు. జిల్లాలోని ప్రజలు ప్రభుత్వాల పాలన చూశారని, అందుకనే నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి ఆశీర్వదిస్తే ప్రజాసమస్యల పరిష్కారంతో పాటు నియోజకవర్గంలో అద్భుత ప్రగతిని సాధించి చూపిస్తామని అన్నారు. నేడు (శనివారం) సీపీఎం అభ్యర్థి నామినేషన్ వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జనగామ బస్టాండ్ నుండి గెస్ట్‌హౌస్ వరకు భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు, ఈ సభకు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యఅతిథిగా పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బూడిద గోపి, రాపర్తి రాజు, జోగు ప్రకాష్, బిట్ల గణేష్, వినయ్, వేణులు పాల్గొన్నారు.

అవినీతి పరులను తరిమికొట్టండి రాజారపు ప్రతాప్ పిలుపు
జఫర్‌గడ్, నవంబర్ 16: ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని వారికి ఓట్లతో బుద్దిచెప్పాలని స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ బీఎస్‌పీ అభ్యర్థి రాజారపు ప్రతాప్ అన్నా రు. శుక్రవారం మండలంలోని హిమత్‌నగర్, సురారం, తీగారం, గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నో రిజర్వాయర్లు ఉన్నా జఫర్‌గడ్ మండలానికి చుక్క నీరు రాకుండా పక్క నియోజకవర్గాలకు పోయిందని అన్నారు. రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. తనను గెలపిస్తే నియోజకవర్గంలోని అన్ని చెరువులను నింపుతానని అన్నారు. అంతేకాకుండా జఫర్‌గడ్ మండలాన్ని ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా అక్రమాలకు పాల్పడి జఫర్‌గడ్ మండలాన్ని తన స్వార్థం కోసం జనగామ జిల్లాలో కలిపాడని, దీనిని అడిగిన ప్రజలను మహిళలు అని కూడా చూడకుండా 73మందిపై కేసు లు పెట్టించడం సిగ్గుచేటన్నారు. వారపై కేసులు ఎత్తివేసిన తర్వాతనే గ్రామాల్లో తిరగనివ్వాలని కోరారు. ఇప్పటికైన ప్రజలు గ్రహించి నిజాయతీపరులను ఎన్నుకుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సోమలక్ష్మి, నాయకులు రఘుపాల్‌రెడ్డి, నర్సింగం, చంద్రవౌళి, అరవిందరావు, కుమార్‌లు పాల్గొన్నారు.