వరంగల్

స్వైన్ ఫ్లూ కలకలం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, నవంబర్ 16: వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు శుక్రవారం కేసముద్రం (వి) గ్రామంలో కేసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ పవన్‌కుమా ర్ నేతృత్వంలో వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. మృతిచెందిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వెంట ఉన్నవారికి పరీక్షలు నిర్వహించడంతో పాటు స్వైన్ ఫ్లూ ముందస్తు నివారణ మందులను అందించినట్లు తెలిపారు. స్వైన్ ఫ్లూతో మృతిచెందిన ఘటనతో గ్రామంలో కలకలం సృష్టిస్తోంది. కేసముద్రం (వి) గ్రామంలో ఓ మహిళ స్వైన్ ఫ్లూ వ్యాధితో రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో మృతిచెందినట్లు నిర్ధారించిన ప్రతి ఒక్కరు ముఖానికి మాస్క్ లేదంటే రుమాలు కట్టుకొని సంచరిస్తున్నారు. కాగా గ్రామంలో ఎవరికి కూడా స్వైన్ ఫ్లూ లక్షణాల్లేవని, మృతి చెందిన మహిళ కొద్ది రోజుల క్రితం భూపాలపల్లి జయశంకర్‌జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి వచ్చిన తరువాత జ్వరం బారిన పడిందన్నారు. ఈ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ జరుపుతున్నట్లు వైద్యాధికారి తెలిపారు. కాగా స్వైన్‌ఫ్లూ వ్యాధిపై గ్రామంలో ప్రజలు అపోహలకు గురవుతున్నారని, ఎలాంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు జలుబు, జ్వరం లాంటి జబ్బులు వచ్చిన తక్షణం వైద్యులను సంప్రదించాలని డాక్టర్ సూచించారు.