వరంగల్

పరకాల యాదిలో ‘సైకిల్’ కనుమరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, నవంబర్ 16: పరకాల ప్రజల యాదిలో నిలిచిన సైకిల్ తాజా బ్యాలెట్‌లో సైకిల్ గుర్తు కనుమరుగు కావడంపై పరకాల నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేక పోతున్నారు. కంచుకోటగా ఉన్న తెదేపా ఈసారి పరకాల అసెంబ్లీ సెగ్మంట్‌లో ఎన్నికల బరిలో లేకపోవడంతో... ఆ పార్టీ గుర్తు సైకిల్ తాజా బ్యాలెట్‌లో ఎక్కడ కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం మహాకూటమి పొత్తులో పరకాల అసెంబ్లీ సెగ్మంట్ స్థానం ఆ పార్టీ దక్కించుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. సిట్టింగ్ స్థానమైన పరకాల మహాకూటమిలో టీడీపీకి కేటాయించకపోవడంతో నేడు పరకాలలో తెలుగుదేశం పార్టీ గతంలోకి జారిపోయిందనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే టీడీపీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే పరకాల మూడవ స్థానంలో ఉండి, నియోజకవర్గంలో 20 వేలకు పైగా శ్రేణులు ఉన్న టీడీపీ గత శాసన సభ ఎన్నికల్లో ఎదురు గాలిలోను సైకిల్ గుర్తుపై చల్లా ధర్మారెడ్డి గెలిచిన విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ప్రజాకూటమి దృష్టికి తీసుకువెళ్లిన పొత్తులో భాగంగా టికెట్ కాంగ్రెస్‌కు కేటాయించడంతో తాజా బ్యాలెట్‌లో సైకిల్ గుర్తు కనుమరుగు అయ్యే అవకాశాలు ఉండడంతో పార్టీ అది నాయకత్వంపై తమ్ముళ్లు గుర్రు మంటున్నారు. ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని పరకాల నియోజకవర్గంలో కంచుకోటగా తీర్చి దిద్దారు. ఎంతో మంది సాధారణ కార్యకర్తలకు అనేక అవకాశాలు కల్పించి గల్లీ నుంచి డిల్లీ దాకా చేరేలా అగ్రనేతలుగా తీర్దిద్దింది. అంతటి వైభవోపేతమైన పార్టీలో ఇప్పుడు నిస్తేజం అవరించింది. అవిర్భావం మొదలుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఆ పార్టీకి, పార్టీతో జత కలిసిన పార్టీలకు ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. ఆ పార్టీ తరుపున గెలిచిన చల్లా ధర్మారెడ్డి ఇప్పుడు టిఆర్‌ఎస్ పార్టీలో బలమైన నేతగా ఉండడమే కాకుండా కారు గుర్తుపై మళ్లీ పరకాల నుండి పోటీ చేస్తున్నారు. 1999 ఎన్నికల్లో తెదెపాకు చెందిన బొజ్జపెల్లి రాజయ్య పోటీ చేసి విజయం సాధించారు. 1985, 1989లో టీడీపీ కీలకంగా మారడంతో పొత్తులో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. 2014లో తెలంగాణ ఉద్యమ హోరులో అంత ఎదరుగాలిలో కూడా పరకాల అసెంబ్లీ సెగ్మంట్ నుండి సైకిల్ గుర్తుపై చల్లా ధర్మారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అలాంటి కంచుకోటగా మారిన టీడీపీ పరకాల సిట్టింగ్ స్థానం టీడీపీ కేటాయించాలని చంద్రబాబునాయుడి దృష్టికి జిల్లా అధ్యక్షుడు, పరకాల టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గన్నోజు శ్రీనివాస్ పలుమార్లు తీసుకవెళ్లారు. బలమైన నియోజకవర్గమైన పరకాల నుండి టీడీపీ జెండా ఎగుర వేయాలని గడప గడపకు గన్నోజు కార్యక్రమం కూడా నిర్వహించారు. కానీ, ఈ దరిమిలా పొత్తులో టీడీపీ కేటాయించకపోవడంతో తెలుగు తమ్ముళ్లు నరాజుగా ఉండడమే కాకుండా తాజా బ్యాలెట్‌లో సైకిల్ గుర్తు కనుమరుగు కావడంపై జీర్ణించుకోలేక పోతున్నారనే వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి.

ఆ పార్టీలను పొలిమెర దాటేవరకు
తరిమికొట్టాలి
ప్రజలను మోసం చేయడానికే మహాకూటమి
కుమ్ములాటలకే వారికి సమయం సరిపోవటంలేదు
సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తాయ
ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
స్టేషన్‌ఘన్‌పూర్, నవంబర్ 16: తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే దొంగల పార్టీలన్ని కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయని ప్రభుత్వ విప్, ఎమ్మె ల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. చిల్పూర్ మండలంలోని చిల్పూర్, పల్లగుట్ట, దేశాయితండా, కృష్ణాజిగూడెం, ఫత్తేపూర్, లింగంపల్లి ,మల్కాపూర్, శ్రీపతిపల్లి గ్రామాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ తాటికొండ రాజయ్య శుక్రవారం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్రభుత్వ విఫ్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలు సుఖ, సంతోషాలతో ఉన్న తెలంగాణ ప్రజలను మోసం చేయాలనే దురుద్ధేశంతో, దొంగల పార్టీలన్ని కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయన్నారు. అలాంటి పార్టీలను ఓట్లతో బుద్ధి చెప్పడమే కాకుం డా తెలంగాణ పొలిమెర దాటేవరకు తరిమి కొట్టాలని ఆయన కోరారు. ఎన్ని కూటమిలు ఎదురుపడ్డా సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు దొంగచాటుగా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్ధేశంతో కాంగ్రెసు పార్టీతో దోస్తీ కట్టి, తెరవెనుక రాజకీయం చేస్తున్నాడని ఆయన అన్నారు, అలాంటి వెన్నుపోటు నాయకులకు డిసెంబరు 7న జరిగే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. గత ప్రభుత్వాలు చేయలేని అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశ పెట్టడమే కాకుండా, ఆయా పథకాలకు లక్షల కోట్ల నిధులను సమకూర్చిన ఘనత ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌దేనన్నారు. నామినేషన్లకు ఇక రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ మహాకూటమి సీట్ల పంపకం మాత్రం ఆదిలోనే ఉందన్నారు. కుమ్ములాటలకే వారి సమయం సరిపోవటంలేదని, ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను ఎలా చక్కదిద్దుతారని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఎడవెళ్ళి కృష్ణారెడ్డి, జనగామ యాదగిరి, మండల పార్టీ అధ్యక్షుడు పోలెపల్లి రంజిత్‌రెడ్డి, పాగాల సంపత్‌రెడ్డి, డాక్టరు వెంకన్న, బాలరాజు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.