వరంగల్

పోరాడి గెలిచిన పొన్నాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, నవంబర్ 17: గత పదిరోజులుగా చర్చనీయాంశంగా మారిన పొన్నాల లక్ష్మయ్య అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శనివారం ఖరారుచేయడంతో జనగామ నియోజకవర్గంలోని కార్యకర్తల్లో ఆనందం పెల్లుబుకుతుంది. గత మూడునెలలుగా పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు.
ఈ క్రమంలో పీసీసీ ఏఐసీసీకి పంపిన జాబితాలో పొన్నాల పేరు లేకపోవడంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు అసంతృప్తికి గురయ్యారు. అధిష్టానం ప్రకటించిన మొదటి, రెండవ విడత జాబితాల్లో ఆయనకు మొండిచేయి చూపడంతో నియోజకవర్గంలోని కార్యకర్తలంతా శాంతియుతంగా నిరసన తెలిపిన విషయం విధితమే. మూడవ జాబితాలో పొన్నాల లక్ష్మయ్య పేరును అధిష్టానం ప్రకటించినందుకు పార్టీ శ్రేణులు గ్రామగ్రామాన సంబురాలు నిర్వహించి అధిష్టానానికి శుభాకాంక్షలు తెలిపారు. పొన్నాల లక్ష్మయ్యకు టికేట్ వస్తదో.. రాదోనని ప్రసార మాధ్యమాలల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో లక్ష్మయ్యపై సానుభూతి పెరిగింది. సోమవారం ఆయన నామినేషన్ ధాఖలు చేయనున్నట్లు పార్టీ అధికార ప్రతినిథి రంగరాజు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. శనివారం జనగామ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జీ చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు కర్ణాకర్‌రెడ్డి, శ్రీనివాస్, ఫీఏసీఎస్ చైర్మన్ ఉమాపతిరెడ్డి, మండల అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి పాల్గోన్నారు.