వరంగల్

19న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా పరకాలకు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, నవంబర్ 17: ఈనెల 19న కేంద్ర ఆరోగ్యశాఖామాత్యులు జయప్రకాశ్‌నడ్డా పరకాలకు వస్తునట్లు వరంగల్ రూరల్ బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్‌రెడ్డి తెలిపారు. శనివారం పరకాల అమరదామంలో నిర్వహించిన సమావేశంలో ఎడ్ల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ పరకాల అభ్యర్థి డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా కేంద్ర మంత్రి హాజరవుతున్నట్లు తెలిపారు. నామినేషన్ సందర్భంగా రోడ్‌షో ర్యాలీ నిర్వహిస్తునట్లు చెప్పారు. అనంతరం ఎంఎన్‌రావు పంక్షన్‌హాల్‌లో పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తునట్లు అశోక్‌రెడ్డి తెలిపారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, పరకాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరకాల బీజేపీ అభ్యర్థి డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి, చందుపట్ల రాజిరెడ్డి, ఆర్‌పి జయంతిలాల్, కానుగుల గోపినాధ్, రాంబాబు, కొత్త దశరథం, దార్న చందర్ తదితరులు పాల్గొన్నారు.

*
అభివృద్ధి కావాలా.. రౌడీ రాజకీయాలు కావాలా..?
పాలకుర్తి, నవంబర్ 17: పల్లెలు ప్రశాంతవాతావరణంలోఉన్నయాని ,పాలకుర్తిలో ప్రజలకు అభివృధ్ధి కా వాలా..? రౌడీ రాజకీయాలు కావా లా?? అని ఆపద్ధర్మ ఉపముఖ్య మం త్రి కడియం శ్రీహరి ప్రశ్నించారు. శనివారం మండల కేంద్రంలోని బషారత్ ఫంక్షన్‌హాల్లో పాలకుర్తి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈసమావేశంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లితో పాటు ముఖ్య కార్యకర్తలు పాల్గోన్నారు.
కడియం శ్రీహరి మాట్లాడుతూ డిశంబర్13 తర్వాత ఏర్పాటయేది టీఆర్‌ఎస్ ప్రభుత్వామేనని ధీమా వ్యక్తం చేశారు.పాలకుర్తిలో అభివృధ్ధి, సంక్షేమానికి మారుపేరు ఎర్రబెల్లి దయాకర్‌రావుని అన్నారు.మహాకూటమి తరుపునపోటి చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధికి డిపాజిట్ కూడ దక్కదన్నారు.పాలకుర్తినియోజకవర్గాన్ని గజ్వెల్,సిద్ధిపేట తరహలో అభివృద్ధి చేయాలనేదే దయాకర్‌రావు తపనని చెప్పారు.నాపాలకుర్తి నీళ్ళు,నిధుల కావాలని ప్రతినిత్యం ప్రభుత్వంతో పోటి పడే వ్యక్తిని, వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు రెండు పంటలకు నీళ్ళు ఇవ్వడానికి చెరువులు నింపె ప్రణాళిక పెట్టుకున్న మంచి మనస్సున్న నాయకులు పేదల సంక్షేమం కొరుకునే ఎర్రబెల్లిని అత్యధిక మేజారిటీతో గెలిపించి,రౌడీలకు,్భకాబ్జదారులకు.రైతుల సోమ్మును మింగిన నాయకుల చెంపచెల్లు మనేల ప్రజలు తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌కు మరోవ్యక్తి రావడం... ఒకే జాతి పక్షులని ప్రజలు ప్రజలు అర్థం చేసుకువాలని విజ్ఞప్తి చేశారు.
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు పేరుతో గ్రామాల్లో మీనరల్ వాటర్ ఫాంట్స్ ఏర్పాటు,నిరుపేదలు చదువుకోవడాని అర్ధికసహాయంఅందిస్తున్నట్లు చెప్పా రు తెరాస ప్రభుత్వానికి ప్రజలు అధికారంఇస్తేఆసరాఫించన్లు రూ.2016, నిరుద్యోగ భృతి రూ.3016,వికలాంగులకు రూ.3016్ఫంచన్,రైతు బంధు పంటసాయంఎకరాకు రూ.10 వేలు,ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమేలక్ష్యంగా కేసీఆర్ పాలన ఉంటుందని కాంగ్రెస్ వస్తే అన్ని సంక్షేమ పథకాలు రద్దు చేస్తారని తెలిపారు.ఈకార్యక్రమంలో జీసీసీ చైర్మెన్ గాంధీనాయక్,ఎంపీపీ భూక్య దల్జీత్‌కౌర్,మండల పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి,నాయకులు రాఘవరావు,అశోక్‌రెడ్డి,వెంకటెష్,క్రిష్ణామూర్తి,దీపక్, ఆఫ్రోజ్,దమోదర్,తదితరులు పాల్గోన్నారు.
* 19న జరిగే కేసీఆర్ సభా స్థలం పరిశీలన..
19న కేసీఆర్ పాలకుర్తికి వస్తున్నందున బహిరంగ సభ ప్రాంగణాన్ని,ఏర్పాట్లను కడియం శ్రీహరి,ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు.ఏర్పాట్లపై పోలీసులకు సూచనలు చేశారు.అదేవిధంగా హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు.కేసీఆర్ సభకు ఇంటింటీకి తరలి రావలని కడియం పిలుపునిచ్చారు.పెద్ద ఎత్తున ప్రజలు హజరై ఎర్రబెల్లి ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు.