వరంగల్

అసత్య ఆరోపణలతో మోసగించలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, నవంబర్ 18: తన పైన వ్యక్తిగతంగా అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మోసగించలేరని.. తెరాస నాయకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంటే కురవి వీరన్న పాదాల మీద ప్రమాణం చేద్దాం సిద్దమా అని డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ది రాంచంద్రునాయక్ సవాలు విసిరారు. కురవి మండల కేం ద్రంలో ఆదివారం కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం కురవి దేవాలయ సెంటర్‌లో నిర్వహించిన ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ.. రెడ్యానాయక్ గత ఎన్నికల్లో నాకు డబ్బులు ఇచ్చాడని, తాను డబ్బులు తీసుకుని వెళ్లిపోయానని.. ఇప్పుడు అదే జరుగుతుందని చౌకబారు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఓటమిభయంతో రెడ్యానాయక్ తనస్థాయిని మరిచి విమర్శలకు దిగుతున్నారని రాంచంద్రునాయక్ అన్నారు. తన స్థానికత అంశాన్ని పదే.. పదే వేలెత్తి చూపుతున్న రెడ్యానాయక్‌కు ఆయన కూతు రు కవితను మానుకోట ఎమ్మెల్యేగా గెలిపించుకున్నప్పుడు ఎందుకు స్థానికత గుర్తుకు రాలేదని ఫ్రశ్నించారు. వైద్యవృత్తిలో ఉన్న తాను ప్రజలకు సేవచేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానని, ఆస్తులు కూడబెట్టుకోవడానికి .. కాపాడుకోవడానికో రాలేదన్నారు. తన కూతురును ఎమ్మెల్యేగా చేసుకున్న రెడ్యానాయక్, రాబోయే కాలంలో తన కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఉవ్విలూరుతున్నారని, డోర్నకల్ నియోజకవర్గంలో మీ కుటుంబం తప్ప ఎమ్మెల్యే పదవిని ఆశించే స్థాయిలో గిరిజనులే లేరా అని సూటిగా ప్రశ్నించారు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్‌పార్టీకి కంచుకోట అని అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి నిరూపించాలని ఆయన కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజాకూటమి నాయకులు నూతక్కి ప్రసాదరావు, నల్లు సుదాకర్‌రెడ్డి, గార్లపాటి వెంకట్‌రెడ్డి, అంబటి వీరభద్రంగౌడ్, కొప్పుల వెంకట్‌రెడ్డి, నారాయణ సురేందర్‌కుమార్, అవిర మోహన్‌రావు, వద్దుల శ్రీనివాస్‌రెడ్డి, నూతక్కి నరసింహరావు, వద్దుల ఉపేందర్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మాదిగలను మోసం చేసిన టీఆర్‌ఎస్
*ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్‌మాదిగ
పరకాల, నవంబర్ 18: మాదిగలను మోసం చేసిన టీఆర్‌ఎస్ పార్టీని రాజకీయంగా బొంద పెట్టాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్‌మాదిగ పిలుపునిచ్చారు. ఆదివారం పరకాలలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దళితున్ని ముఖ్యమంత్రి చేసినందుకు టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయాల అని ప్రశ్నించారు. కేసిఆర్ అసెంబ్లీ నిండు సభలో మందకృష్ణమాదిగను అణిచి వేస్తానని ప్రకటించినందుకా, అక్రమ కేసులు పెట్టి జైలుల్లో పెట్టినందుకా, దళితులకు 3 ఎకరాల భూపంపిణీ చేసినందుకు టిఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. మాదిగలను మోసం చేస్తూ రాజకీయంగా ఎదుగుతున్న మాదిగలపై అక్రమ కేసులు పెట్టి, మాదిగ, మాదిగ ఉప కులాలను వంచిస్తూ పరిపాలన కోనసాగిస్తున్న టిఆర్‌ఎస్ పార్టిని మాదిగ, మాదిగ ఉపకులాలు ఓటు వేయకుండా బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యాక న్న, వీరన్న, పాముల సుబ్బన్న, చందర్, ఏకు శంకర్, యుగేందర్, బొచ్చు శంకర్ తదితరులు పాల్గొన్నారు.