వరంగల్

పోలీస్ వ్యవస్థ లేకుంటే సమాజం అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, నవంబర్ 18: పోలీస్ వ్యవస్థ పనితీరు పైనే సమాజంలో శాంతిభద్రతలు ఆధారపడి ఉన్నాయని, పోలీసులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సమాజం అస్తవ్యస్తంగా మారుతుందని పోలీస్ న్యాయసలహాదారు రామానుజారెడ్డి అన్నారు. మహబూబాబాద్ టౌన్‌పోలీస్‌స్టేషన్ సమావేశమందిరంలో ఆదివారం చట్టాల పైన అవగాహనసదస్సును నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసుశాఖ విధినిర్వాహణ మూలంగానే చట్టం, ధర్మం, న్యాయం సజావుగా ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. చట్టాలపట్ల మరింతగా అవగాహన పోలీస్‌అధికారులు, సిబ్బంది పెంపొందించుకుంటే ప్రజలకు మరెంతగానో న్యాయం చేకూరుతుందని ఆయన అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రతి అంశం ఒక్కొక్క సందర్భంలో క్లిష్ట సమస్యగా మారుతుందన్నారు. అప్పుడు తీవ్రతను తగ్గించడానికి, సరియైన చర్యలు తీసుకోవడానికి చట్టాలపైన అవగాహన ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. చట్టాలలోని అంశాలను వివరిస్తూ., వాటిని ఎలా ఉపయోగించుకోవాలో రామానుజరెడ్డి వివరించారు. పోలీస్ అధికారుల అనుమానాలను ఆయన నివృత్తి చేసారు. అనంతరం మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు ఇంకా 20రోజులు మాత్రమే ఉన్నాయని జిల్లా పోలీస్‌యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎక్కడికక్కడ నిఘా పెంపొందించాలని, నిబందనలను ఎవరు అతిక్రమించిన చట్టపరిధిలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్, జిల్లా పరిధిలోని డి ఎస్పీ లు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

నేను నిరంతర ప్రజాసేవకుడిని
* ప్రజాదరణ నన్ను తిరిగి గెలిపిస్తుంది.. * డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్
మహబూబాబాద్,నవంబర్ 18: డోర్నకల్ నియోజకవర్గం నాదేవాలయం.. నియోజకవర్గ ప్రజలందరు నాకు దేవుల్లు.. నేను వారికి సేవచేసే నిరంతర సేవకున్ని అని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. డోర్నకల్ మండలంలోని గొల్లచెర్ల గ్రామంలో ఆదివారం ఆశీర్వాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరి కష్టం తెలిసిన వ్యక్తిలాగా.. కుటుంబానికి పెద్దకొడుకులాగా అందరికి కావలిసిన సంక్షేమపధకాలను ప్రవేశపెట్టడం ద్వారా మన రాష్రాన్ని బంగారు తెలంగాణ దిశగా నడిపిస్తున్నారన్నారు. పోరాడి సాదించుకున్న తెలంగాణరాష్రాన్ని అదే పోరాటస్పూర్తితో అభివృద్ది చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో కనిపిస్తున్న ప్రతి అభివృద్ది ఎమ్మెల్యేగా తాను సాదించిందేనని రెడ్యానాయక్ అన్నారు.నిరంతరం నియోజకవర్గంలోనే అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నందునే ఎమ్మెల్యేగా ఐదుసార్లు విజయం సాదించడం జరిగిందన్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేయడం జరిగిందని, మిగిలిపోయిన అభివృద్దిని ప్రజల ఆశీర్వాదంతో విజయం సాదించిన తరువాత పూర్తిచేస్తానన్నారు. డోర్నకల్ నియోజకవర్గ ప్రజల సాగునీటి కష్టాలు తీరాలంటే కాళేశ్వరం పూర్తి కావడేమే ఏకైక మార్గమని రెడ్యానాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అద్యక్షులు గొల్ల సత్తిరెడ్డి, ఎంపీపీ మేకపోతుల రమ్యశ్రీనివాస్, జెడ్పిటిసి స్వరూపకోటిలింగం, వాంకుడోత్ వీరన్న, కోటిలింగం తదితరులు పాల్గొన్నారు.