వరంగల్

నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 18: ఉమ్మడి వరంగల్ జిల్లాలో లెక్కతేలింది. నేటితో నామినేషన్ల పర్వం ముగియనుడడం తో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్ధులను ప్రకటించాయి. ఉమ్మడి జిల్లాలో 12 స్ధానాలకు గాను టీఆర్‌ఎస్ అందరికం టే ముందుగానే తమ అభ్యర్ధులను ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన, ఓడిపోయిన అభ్యర్ధులను తిరిగి ప్రకటించగా కాంగ్రెస్ ఆధ్వర్యం లో ఏర్పాటు అయిన మహాకూటమి అభ్యర్ధుల ఎంపిక వివిధ మలుపులు తిరిగి ఎట్టకేలకు ఖరారు అయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 12 స్ధానాలకు గాను తొమ్మిది స్ధానాల్లో కాంగ్రెస్, రెండు స్ధానాల్లో టీజేఎస్, టీడీపీకి ఒక స్ధానా న్ని కేటాయించారు. తాజాగా టీజేఎస్‌కు కేటాయించిన వరంగల్ తూర్పు లో గదె ఇన్నయ్య, వర్ధన్నపేటలో ఎన్‌ఆర్‌ఐ నేత దేవయ్యకే అభ్యర్ధుత్వాలు ఖరారు అయ్యాయి. నేటి నామినేషన్ల ఘట్టానికి తెరపడనుండడంతో నామినేషన్ అభ్యర్ధులందరు నామినేషన్ ధాఖాలు చేయనున్నారు. ఇంకా నామినేషన్ల ఘాట్టానికి తెరపడడంతో అభ్యర్ధులంతా ప్రచారాన్ని మరింత ఉదృతం చేయనున్నారు. అదే విధంగా తూర్పు బీజేపి అభ్యర్ధిగా కుసుమ సతీష్, జనగామ అభ్యర్థిగా కెవిఎల్‌ఎన్ రెడ్డి, డోర్నకల్ అభ్యర్థిగా లక్ష్మణ్‌నాయక్‌లను ఎంపిక చేశారు.

ప్రజలకు మేలు చేయని టీఆర్‌ఎస్: పోరిక
కేసముద్రం, నవంబర్ 18: తెలంగా ణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని ప్రజ లు టీఆర్‌ఎస్‌కు అధికారమిస్తే గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో ఏ మాత్రం మే లు చేయలేదని, సీఎం కేసీఆర్ మిగులు బడ్జెట్‌తో ఏర్పడ్డ తెలంగాణను అప్పుల పాలు చేశారని మహబూబాబాద్ అసెంబ్లీ అభ్యిర్ధిగా పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్ విమర్శించారు. ఆదివారం కేసముద్రం జడ్పీటీసీ బండారు పద్మ, దన్నసరి సింగిల్‌విండో చైర్మెన్ బండారు వెంకన్నతో పాటు వివిధ పార్టీల నుండి దాదాపు 600 మంది కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా మండల అధ్యక్షుడు ఎలగలబోయిన వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో చేసిన అభివృద్ధి పనులే తప్ప టీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయాంలో చెప్పుకోదగ్గ పనులే చేయలేదన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పోడు భూములకు పట్టాలిప్పిస్తే, టీఆర్‌ఎస్ ప్రభుత్వ పోడు భూములను హరితహారం పేరుతో స్వాదీనం చేసుకొని పేదల జీవితాల్లో చీకట్లు నింపిందన్నా రు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టో కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు రావుల రవిచందర్‌రెడ్డి, నునావత్ రమేష్, ఎస్.వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
కాగా కాంగ్రెస్ పార్టీ నుండి జడ్పీటీసీగా గెలిచిన బండారు పద్మ, దన్నసరి సోసైటీ చైర్మెన్‌గా ఎన్నికైన బండారు వెంకన్న దంపతులు 2015లో టీ ఆర్ ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే టీఆర్‌ఎస్‌లో చేరినవారికి ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌తో ఇమడలేకపోతున్నామని ప్రకటించి, తిరిగి మాతృసంస్థలో చేరడానికి నిర్ణయించి తమ అనుచరులతో చేరారు. పార్టీలో చేరడానికి ముం దు దాదాపు 400 సైకిల్ మోటార్లతో ర్యాలీ నిర్వహించారు.