వరంగల్

మానుకోటను అభివృద్ధికి అడ్డాగా మారుద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్,నవంబర్ 19: అభివృద్ధిలో వెనుకబడ్డ మానుకోటను రాష్ట్రంలోనే అభివృద్ధికి అడ్డాగా మారుద్దామని, ఇంతకాలం స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేసిన వ్యకు తల్లా కాకుండా ప్రజల కోసం పనిచేసే తనకు అవకాశం ఇవ్వాలని మానుకోట బీజేపీ అభ్యర్థి జాటోతు హుస్సెన్‌నాయక్ అన్నారు. మహబూబాబాద్‌లో సోమవారం స్థానిక ఎన్‌టిఆర్ స్టేడియం నుండి తహశీల్దారు సెంటర్ వరకు బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్‌టిఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రంరెడ్డి సిద్దార్దరెడ్డితోపాటు, పాల్వాయి రేవంత్‌రెడ్డి, యశ్‌పాల్‌రెడ్డిలు బీజేపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు యాప సీతయ్య వారికి పార్టీ కండువాలు ఆహ్వానించారు. ఈ ర్యాలీ లో భాగంగా ముత్యాలమ్మగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి హుస్సెన్‌నాయక్ నివాళులు అర్పించారు. రిటర్నింగ్ అధికారి కొంరయ్యకు మరోసెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం హుస్సెన్‌నాయక్ మాట్లాడుతూ.. మహబూబాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని ప్రధాని నరేంద్రమోదీకి కానుకగా అందిద్దామని అన్నారు. మహబూబాబాద్ ఎన్నికల బరిలో స్థానికుడినైన తనకు, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వలస వచ్చిన స్థానికేతరుల కు పోటీ జరుగుతుందన్నారు. వలసనే తలు అభివృద్ధిని గద్దల్లా తన్నుకుపోతున్నారని, మానుకోట అభివృద్ధి చెందకుండా వెనుకబాటు తనానికి గురిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాంచందర్‌రావు, లక్ష్మణ్‌రావు, రాచకొండ కొంరయ్య, గూడూరు ఎంపీపీ చెల్పూరి వెంకన్న, నేతాజీ, శ్రీరాంపుల్లయ్య, రాఘవులు, రాధాబాయ్‌పటేల్, శ్యాంసుందర్‌శర్మ, సంపత్, ప్రకాష్‌రెడ్డిలతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అభివృద్ధి బాట పట్టిస్తా..
పరకాల బిజేపీ అభ్యర్థి పెసరు విజయచందర్‌రెడ్డి హామీ

పరకాల, నవంబర్ 19: పరకాల అసెంబ్లీ బరిలో బీజేపీ పక్షాన పోటీ చేస్తున్న తనకు నియోజకవర్గ ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని ఐదు సంవత్సరాలు సేవకుడిలా పని చేస్తానని పరకాల బీజేపీ అభ్యర్థి డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి అన్నారు. సోమవారం పరకాల పట్టణంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయచందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఏకైక సంకల్పంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. పరకాల నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదిస్తే తాను ఐదు సంవత్సరాల పాటు సేవ చేసి పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తానని తెలిపారు. పరకాల నుండి గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయలేదన్నారు. పరకాల నియోజకవర్గంలో ప్రజల నుండి అనూహ్యమైన ఆదరణ లభిస్తుందన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటా ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా కార్యదర్శి ఆర్‌పి జయంతిలాల్, రామన్న, కట్టగాని శ్రీకాంత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.