వరంగల్

మిల్లర్లు సకాలంలో బియ్యం ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, నవంబర్ 19: కస్టం మిల్లింగ్ కింద సేకరించిన ధాన్యాన్ని మరాడించి సకాలంలో బియ్యాన్ని గోదాముకు చేరవేయాలని మిల్లర్లకు మహబూబాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ డేవిడ్ సూచించారు. సోమవారం కేసముద్రం మార్కెట్ ఆవరణలోని గోదాములో (సీఎంఆర్) బియ్యం సేకరణ కార్యక్రమాన్ని జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను వెంటవెంటనే ట్యాబుల్లో నమోదు చేసి ఆన్‌లైన్ చేయాలన్నారు. మిల్లులకు ధాన్యం చేరగానే ఆలస్యం చేయకుండా వెంటవెంటనే బియ్యం పట్టి గోదాముకు తరలించాలన్నారు. ధాన్యం, బియ్యం సేకరణ పూర్తిగా ప్రభుత్వం నిర్ధేశించిన నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఓ నర్సింహారావు, సివిల్‌సప్లై డీఎం మహేందర్, డీఎంఓ సురేఖ, మార్కెట్ కార్యదర్శి అంజిత్‌రావు పాల్గొన్నారు.