క్రైమ్/లీగల్

విష ప్రయోగంతో బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయపర్తి, నవంబర్ 20: విష ప్రయోగంతో బాలుడు మృతిచెందిన సంఘటన మండలంలోని సన్నురు శివారు రాజ్యనాయక్ తండాలో మంగళవారం చోటు చేసుకుంది. బానోతు రెడ్యా-సూజాత దంపతులకు ఇద్దరు కుమార్తెలు 10 నెలల బాలుడు ఉన్నారు. గత పది రోజుల క్రితం రెడ్యా పాలెరు పనికి వెళ్ల గా భార్య సుజాత తన కుమార్తెతో పాటు బాలుని కూడా తన మామకు అప్పగించి వ్యవసాయ పనుల కోసం వెళ్లింది. తన మామ రైతు బందు చెక్కుల నిమిత్తం బ్యాంక్‌కు వెళ్లాడు. దీంతో రెడ్యా తమ్ముడు సంతు, భార్య రజిత చుక్క ల మందులో విషం కలిపి బాలుని నోట్లో పోసింది. దీంతో బాలుడు అపస్మారక స్ధితిలోకి వెళ్లాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. బాలుని తండ్రి రెడ్యా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.