వరంగల్

పరకాలలో 2 నామినేషన్లు తిరస్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, నవంబర్ 20: శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని పరకాల అసెంబ్లీ సెగ్మంట్‌కు 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా మంగళవారం అధికారులు పరిశీలించారు. 12 నామినేషన్లలో 2 నామినేషన్లను తిరస్కరించినట్లు పరకాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి మహేందర్‌జీ తెలిపారు. కొండా మురళీధర్‌రావు, పెసరు సుదేష్ణలు నిర్ణిత సమయంలో ఫారం ఏ, బి సమర్పించలేదని చెప్పారు. నామినేషన్ ఫారం 2బి లో ఒక్కరే ప్రతిపాదించడం వల్ల వారి నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు.
అర్హులైన అభ్యర్థుల జాబితా: పరకాల శాసనసభ ఎన్నికల బరిలో 10 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్-కొండా సురేఖ, టీఆర్‌ఎస్-చల్లా ధర్మారెడ్డి, బీజేపీ-డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి, బీఎస్పీ- శనిగరపు రాజు, ఆర్‌పీఐ-ఎలమద్రి రవి, బీఎల్‌ఎఫ్-గోనే కుమారస్వామి, శివసేన-గుండా రాము, ఎస్పీ-దారం యువరాజు, ఎస్పీపీబీ-కొమ్ముల ధర్మయ్య, ఇండియన్ న్యూ కాంగ్రెస్-పున్నం భాగ్యశ్రీ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్- ఇసంపెల్లి వేణు, స్వతంత్ర అభ్యర్థులుగా అబ్బాడి బుచ్చిరెడ్డి, అర్షం శ్రీనివాస్, అడెపు రమేష్, జి. కోర్నెల్, గాలి రవీందర్, చల్లా జ్యోతి, చాపర్తి కుమారస్వామి, యు. శ్రీనివాస్, జి. సాంబయ్య, పెట్టెం సౌజన్యలు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు వేసినట్లు పరకాల శాసనసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మహేందర్‌జీ తెలిపారు.

సమాచారం తెలిపితే రూ.5లక్షలు గిఫ్ట్
ఏటూరునాగారం, నవంబర్ 20: మావోయిస్టు యాక్షన్ టీం ఏజన్సీ ప్రాంత అడవుల్లో సంచరిస్తుందనే సమాచారం మేరకు ఆచూకీ తెలిపిన వారికి రూ.5లక్షల బహుమతిని పోలీసుశాఖ అందిస్తుందని కన్నాయిగూ డెం ఎస్సై పోగుల శ్రీకాంత్ అన్నారు. ఈమేరకు మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల పోష్టర్‌ను ఆవిష్కరించారు. మంగళవారం కన్నాయిగూడెం మం డలం కంతనపల్లి పరిధిలోని గొత్తికో య గూడెంలో ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ చేపట్టారు. కార్యక్రమంలో సివిల్, సిఆర్‌పిఎఫ్ సిబ్బం ది పాల్గొన్నారు.

మీరూ ఫిర్యాదు చేయవచ్చు
ఎన్నికల పరిశీలకులు అనిమేష్ దాస్
ములుగుటౌన్, నవంబర్20: డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులైనా ప్రతి ఒక్కరు తమకు తెలిపి ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల పరిశీలకులు అనిమేష్ దాస్ మంగళవారం తెలిపారు. అదే విధంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రత్యేకంగా రూపొందించిన లోగోను ఆవిష్కరించారు. కార్యాలయంలో ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి 12:05 నిమిషాల వరకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. ఫిర్యాదులకు 7995433912, 7382023443లను సంప్రదించాలన్నారు.