వరంగల్

కోదండరాంను చూస్తే జాలేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కాంగ్రెస్ దృతరాష్ట్ర కౌగిలి ప్రజలకు అక్కరలేదు * ప్రభుత్వ చీఫ్‌విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
మహబూబాబాద్, నవంబర్ 20: ప్రపంచ చరిత్రలోనే ఏ ఉద్యమకారునికి జరుగనంత ఘోర అవమానం కాంగ్రెస్ పంచన చేరిన కొదండరాంకు జరిగిందని ఆయన పరిస్థితిని చూస్తే పాపం కోదండరాం అని జాలేస్తుందని ప్రభుత్వ చిప్ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మహబూబాబాద్ తెరాస పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 119 స్థానాలకు పోటీచేస్తానని పార్టీపెట్టిన కోదండరాం కాంగ్రెస్‌తో జతకట్టి ముప్పైఐదు, పదహారు, ఆఖరు కు ఏనమిది స్థానాలు ఇవ్వలంటూ దిగజారిపోయినా విలువ దక్కలేదన్నారు. ఆఖరుకు తన ఒక్క సీటు కోసం ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీ ఎదుట పొర్లుదండాలు పెట్టినా ప్రజాబలంలేని నీకు టికెట్ వద్దని అన్నారని విమర్శించారు. కాంగ్రెస్‌పార్టీ నమ్మించి ఎలా వంచన చేస్తుందో కోదండరాంకు ఇప్పటికైనా తెలిసి ఉంటుందని రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సంక్షేమ రంగంలో రాష్ట్రాన్ని అగ్రభాగానా నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్రాన్ని పట్టి పీడించే దృతరాష్ట్ర కౌగిలిలాంటా కాంగ్రెస్‌ను ఎవరూ కోరుకోవట్లేదన్నారు. కేవలం అధికార కాంక్షతో ఏర్పడిన కూటమిని తెలంగాణ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించి గుణపాఠం నేర్పుతారని అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయకూడదో చెప్పడానికి ఒక్క కారణమైనా ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ముందుండి పోరాటం నిర్వహించిన తెలంగాణ రాష్టస్రమితికి తిరిగి ప్రజలు అధికారం కట్టబెడుతారని, తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసుకున్న కాంగ్రెస్‌ను ఓడిస్తారన్నారు. తిరిగి అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో అమలవుతాయన్నారు. ఆసరా పెన్షన్‌లను రెట్టింపుచేయడం, సోంత స్థలాల్లో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, నిరుద్యోగ భృతి, లక్షరూపాయల పంటరుణమాఫీ వంటి మరెన్నో గొప్ప పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖారరైపోయిందని, డిసెంబర్ 11న వచ్చే ఫలితాలు లాంచనమే అన్నారు. మానుకోట నియోజకవర్గంలో ప్రజలు భారీ మెజార్టీతో బానోత్ శంకర్‌నాయక్‌ను రెండవసారి గెలిపించాలని రాజేశ్వర్‌రెడ్డి కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో మానుకోట తెరాస అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తోపాటు పార్టీ నాయకులు బీరవల్లి భరత్‌కుమార్‌రెడ్డి, పాల్వాయి రాంమ్మోహరెడ్డి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, మార్నేని వెంకన్న, భూక్య ప్రవీణ్‌నాయక్, ఎడ్ల వేనుమాధవ్, ఫరీద్, బిక్కునాయక్, రమేష్‌గౌడ్, యాకుబ్‌రెడ్డి, గడ్డం అశోక్ తదితరులు పాల్గొన్నారు.