వరంగల్

తప్పిపోయిన బాలున్ని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేగొండ, నవంబర్ 21: ట్విట్టర్ ఫిర్యాదుకు స్పందించిన భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్ పోలీసుల సహకారంతో తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు భూపాలపల్లి డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కిరణ్ కుమార్ తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రు లకు అప్పగించారు. మండలంలోని నిజాంపల్లి గ్రామానికి చెందిన ఈర్ల పోషాలు - సరితల కుమారుడు అనే్వష్ నర్సంపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో సెల్‌ఫోన్ విషయంలో తల్లితో గొడవపడి ఈ నెల 17న ట్రైన్‌లో హైదరాబాద్‌కు వెళ్లినట్లు డీఎస్పీ తెలిపారు. హైదరాబాద్‌లో భయాందోళనకు గురైన అనే్వష్ తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో తప్పిపోయి వేరే ట్రైన్ ఎక్కి మహా రాష్టల్రోని ఆంకోలకు చేరుకున్నాడు. అయితే అక్కడ మహారాష్టక్రు చెంది న మోరె గోవింద్ సివిల్ సర్వీసెస్ చదివే యువకుడు అనే్వష్‌ను గమనించి అతని వివరాలు సేకరించి భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్‌కు ఫిర్యాదు చేశాడు. ఈనెల 19న వివరాలు సేకరించిన జిల్లా ఎస్పీ, చిట్యాల సీఐ శ్రీనివాస్‌కు మహారాష్టక్రు వెళ్లి అనే్వష్‌ను తీసుకురావాలని కోరగా కానిస్టేబుల్ రామన్న సహాయంతో మహారాష్టల్రోని అంకోలకు వెళ్లి తప్పిపోయిన అనే్వష్‌ను తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన విద్యార్థిని అప్పగించిన మోరె గోవింద్ కు, కానిస్టేబుల్ రామన్నకు తగిన పారితోషికం ఇచ్చినట్లు డీఎస్పీ తెలిపారు.

‘ముల్కనూరు’ ఎన్నికల్లో ప్రవీణ్‌రెడ్డి ప్యానల్‌దే గెలుపు
భీమదేవరపల్లి, నవంబర్ 21: ముల్కనూరు సహకార బ్యాంక్ ఐదు డైరెక్టర్ స్ధానాలకు జరిగిన ఎన్నికల్లో అల్గీరెడ్డి ప్రవీన్‌రెడ్డి ప్యానల్‌కు చెందిన ఐదుగురు డైరెక్టర్లు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి కే. కర్ణాకర్ బుధవారం తెలిపారు. గత నెల 28న సహకార బ్యాంక్ ఎన్నికలు జరగగా ప్రత్యర్ధి వర్గీయులు హైకోర్టు ఆశ్రయించడంతో ఎన్నికల ఫలితాలను వాయిదా వేయమని ఆదేశించారు. దీంతో బుధవారం ఓట్ల లెక్కింపు జరగగా నాలుగో నియోజకవర్గం నుండి అన్నం తిరుపతి రావుకు 1776 ఓట్లు రాగా, జైపాల్‌రెడ్డికి 276 ఓట్లు వచ్చాయి, ఆరోవ నియోజకవర్గం నుండి చికట్ల రాజయ్యకు 1789 ఓట్లు రాగా బోయిన పల్లి రాజేశ్వర్‌రావుకు 248 ఓట్లు వచ్చాయి, 11వ నియోజకవర్గం నుండి రాఘునాయకుల వెంకట్‌రెడ్డికి 1754 ఓట్లు రాగా గరగే యాదగిరికి 272 ఓట్లు వచ్చాయి. 13వ నియోజకవర్గం నుండి బానోతు కిషన్, 15వ నియోజకవర్గం నుండి గడ్డ ఐలయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికైనుట్లు ఎన్నికల అధికారి కర్ణాకర్ తెలిపారు. సమావేశంలో బ్యాంక్ అధ్యక్షులు అల్గీరెడ్డి ప్రవీన్‌రెడ్డి, మారుపాటి రాంరెడ్డి, వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

రన్ ఫర్ డెమోక్రసీకి విశేష స్పందన
వరంగల్, నవంబర్ 21: పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా వరంగల్ నగరంలో గత ఎన్నికలలో పోలింగ్ శాతం తక్కువగా నమోదు అవుతున్నందున, డిసెంబర్ 7న జరిగే శాసనసభా ఎన్నికలకు పోలింగ్‌ను పెంచుటకు వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఓటరు నమోదుకు చేసి న స్వీప్ ప్రచార కార్యక్రమం ద్వారా కొత్తగా 43వేల మంది జాబితాలో నమోదుచేసుకున్నారు. అదే స్పూర్తితో కనీసం 90శాతం ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించుటకై ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం నుండి పబ్లిక్ గార్డెన్ వరకు నిర్వహించిన 2కే రన్ ఫర్ డెమోక్రసీ ప్రజా సామ్యం కోసం పరుగు కి విశేషస్పందన లభించింది. ఈ పరుగులో దాదాపు 1000 మంది యువత పాల్గొన్నారు. యువతకు ఉత్సాహాన్ని నింపేందుకు ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకులు సురేంద్రసింగ్ మీనా, ఆనంద్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, పోలీస్ కమిషనర్ రవీందర్, సంయుక్త కల్టెకర్ దయానంద్, ఈ 2కే రన్‌లో పరిగెత్తారు. ఈ సందర్భంగా ఎన్నికల పరశీలకులు సురేంద్రసింగ్ మీనా మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుటకు యువత చొరవతీసుకోవాలని కోరారు.