వరంగల్

నర్సంపేటలో రేపే కేసీఆర్ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, నవంబర్ 20: ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సంపేటలో శుక్రవారం ఉదయం 11 గంటలకు జరిగే భారీ బహిరంగసభలో పాల్గొనేందుకు టీఆర్‌ఎస్ అధినేత, అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నట్లు టీఆర్‌ఎస్ నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. నర్సంపేట పట్టణంలోని సర్వాపురంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల పద్మా వెంకట్‌రెడ్డి స్వగృహంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి కేసీఆర్ సభకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పట్టణంలోని సర్వాపురం శివారులో యాబై ఎకరాల సువిశాల స్థలంలో బహిరంగసభకు భారీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపురం, నెక్కొండ, నర్సంపేట రూరల్ మండలంతో పాటు పట్టణం నుండి పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు, జనం హాజరు కానున్నట్లు తెలిపారు. ఇంత వరకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో జరగని విధంగా దాదాపు 75వేల మంది సభకు వచ్చే అవకాశం ఉందన్నారు. సభకు భారీగా వచ్చే జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈవిలేఖరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి, చిలువేరు రజనీభారతి, దార్ల రమాదేవి, గుంటి కిషన్, గోగుల రాణాప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ అభివృద్ధి తెరాసతోనే సాధ్యం
* స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
మొగుళ్లపల్లి, నవంబర్ 21: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని, నాలుగున్నరేళ్ల పాలనలో నిరూపించినట్లు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మొగుళ్లపల్లి మండలంలోని ముల్కనపల్లి, కొరికిశాల, పోతుగల్లు, కర్లపల్లి, పెద్ద కోమటి పల్లి, గణేష్ పల్లి గ్రామాలలో రోడ్ షోలతో పాటు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మధుసూదనాచారికి అన్ని గ్రామాలలో మహిళలు, యువకులు, రైతులు భారీగా స్వాగతం పలికారు. ములకనపల్లిలో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 7న జరిగే ముందస్తు ఎన్నికలలో భూపాలపల్లి అభివృద్ది కావాలా, వద్దా అనే సందేహాన్ని తేల్చుకోవాల్సిన ప్రజలు కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టితో గెలిపించాలని కోరారు. అదేవిధంగా గతంలో అవకాశం ఇచ్చిన ప్రజలకు మూడు వేల కోట్లతో అనేక అభివృద్ది పనులు చేసిన తనను ఆశీర్వదించాలని ఆయన వేడుకున్నారు. ప్రత్యేకంగా తెరాస ప్రభుత్వంలో జరిగిన అభివృద్దితో పాటు మరింత అభివృద్ది జరగనున్నదని ఆయన అన్నారు. ఇదే సమావేశంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, తెరాస నేత సాంబారి సమ్మారావు మాట్లాడుతూ అభివృద్ది మరిచిన నాయకులంతా ఓటు కోసం వస్తున్నారని, వారందరికి తగిన బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని, ఓటు ద్వారా మధుసూదనాచారి సత్తా ఏమి టో చూపించాలని ప్రజలను కోరారు. వారి వెంట మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతి రావు, ఎంపీపీ ఎన్ విజయలక్ష్మి మల్లయ్య, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మంద స్వామి, ఆ పార్టీ నేతలు జయపాల్ రెడ్డి, పున్నం చందర్, మంద సాంబయ్య, రవిందర్ రావు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

మహాకూటమి కాదది దొంగల కూటమి
* రేవూరి భూకబ్జాలు బయట పెడతాం: వినయ భాస్కర్
వరంగల్, నవంబర్ 21: మహాకూటమికి చెందిన పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి భూకబ్జాలు బయటపెడుతామని మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి దాస్యం వినయ భాస్కర్ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. బుధవారం హన్మకొండలోని 45, 46డివిజన్లలోని రాంనగర్, నక్కలగుట్ట తదితర ప్రాంతాలలో వినయ భాస్కర్ ఇంటింటా ఎన్నికల ప్రచారా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టడం ఒక హేయమైన చర్య అని అడ్డుపడ్డ తెలంగాణ ద్రోహి చంద్రబాబుకు ఓట్లు అడిగే నైతిక హక్కులేదని విమర్శించారు. వరంగల్ జిల్లాలో ఉన్న దొంగలు, రౌడీయిజం చేసే వాళ్లు మహాకూటమిలో ఉన్నారని, ఇది మహాకూటమి కాదు దొంగల కూటమని ఆరోపించారు. మహాకూటమి అభ్యర్థు లు ప్రజలను మాయచేసి ఓట్లు అడిగి అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు. తనపై అసత్యపు ఆరోపణలు చేస్తున్న స్థానికేతరుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డికి డిపాజిట్ రాకుండా ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించా రు. 30ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఉద్యమ కేసులు తప్పా మరే కేసులు లేవని, నిరాదారమైన ఆరోపణలు చేస్తున్న రేవూరికి దమ్ముంటే ఆదారాలతో ముందుకు రావాలని సవాల్ విసిరారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు ను అదుపులో పెట్టుకోవాలని, మహాకూటమి అభ్యర్థుల అందరి జాతకాలు బయటపెడతామని హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గాన్ని టూరిస్టు హబ్‌గా తీర్చిదిద్దుతానని, అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర రైతు విమోచన సమితి చైర్మెన్ వెంకన్న, కుడా చైర్మెన్ యాదవరెడ్డి, ప్రచార కన్వీనర్ జనార్ధన్ గౌడ్, శ్రీనివాస్, విప్లవ్‌రెడ్డి, రజినికాంత్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.