వరంగల్

బాబు, రేవంత్‌లు జైలుకెళ్లడం ఖాయం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, నవంబరు 21: ఓటు కు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్‌రెడ్డిలు ఎన్ని రోజులకైనా జైలుకు వెళ్లడం ఖాయమని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలపై నిత్యం ఓటుకునోటు కేసు కత్తిలాగ వెంటాడుతుందన్నారు. జాతీయ స్థాయి నేత రాహుల్‌గాంధీ తెలంగాణలో ఎమ్మెల్యే ల టికెట్‌ల విషయంలో చంద్రబాబు వద్దకు తిరగడమేంటని ఆయన అంత దిగజారాల్సిన అవనరమేంటన్నారు. నల్గొండ జిల్లాకు సాగునీటిని అందించే ప్రాజెక్ట్ రద్దు చేయాలని ఆంధ్ర సీ ఎం 32 లేఖలు రాసినారని ఆయినప్పటికి ఇక్కడ నేతలు ఇంకా ఆయనకు మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. ఉమ్మ డి రాష్ట్రంలో తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాదని.. ఆంధ్రపాలకుల వల్ల వెనుకకు నెట్టివేయబడిన ప్రాంతమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక పధకాలకు కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు అనే క ప్రాంతాలలో శిలాఫలకాలు వేస్తే తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చాక అశిలాఫలకాలకు దినవారాలు చేశామని ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక పధకాలకు ఆంధ్రా పాలకులు మంగళం పాడారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సాగునీరు, 24 గంటలు విద్యు త్, రైతులకు అనేక సంక్షేమ పధకాలు ఇచ్చిన ఘనత దక్కుతుందన్నారు. హుస్నాబాద్ నియోజక వర్గంలో రూ. 5200 కోట్ల అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. నియోజక వర్గ అభివృద్ధి కొరకు సతీష్‌కుమార్‌ను అశీర్వదించాలన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ సుధీర్‌కుమార్, వంగ రవిందర్, రాచందర్ నాయక్, సయ్యద్ శరీద్దిన్, భారత తిరుపతి, జక్కులరాజు, ఏనుగు సత్యవతి, మాడ్గుల అశోక్, బొల్లంపల్లి రమేశ్, చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

తెరాసపై అభాండాలు వేయడం మానుకో..
* ఎంపీ కొండా విశే్వశ్వర్‌రెడ్డికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరిక
కేసముద్రం, నవంబర్ 21: ఎంపీ కొండా విశే్వశ్వర్‌రెడ్డికి టీఆర్‌ఎస్ పార్టీ ఎనలేని గౌరవం ఇచ్చిందని, ఆయనకు చెందిన కంపెనీకి బీమా పథకం ఇవ్వడం తో పాటు మిషన్ భగీరథ కాంట్రాక్టు పనులు అప్పగించిందని, పార్లమెంట్‌లో గంటల కొద్ది మాట్లాడే అవకాశం కల్పిస్తే.. తనకు మంత్రి మహేందర్‌రెడ్డి ఉన్న వ్యక్తిగత విభేదాలతో పార్టీని వీడి.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌పై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని, ఆయన చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇప్పటికైనా పార్టీపై లేని పోని ఆరోపణలు చేయడం మానుకోవాలని విశే్వశ్వర్‌రెడ్డిని పల్లా హెచ్చరించారు. బుధవారం కేసముద్రం మండల కేం ద్రంలో మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేవెళ్ల, తాం డూర్ నియోజకవర్గాల్లో మంత్రి మహేందర్‌రెడ్డికి, ఎంపీ విశే్వశ్వర్‌రెడ్డికి భూతగాదాలున్నాయని, ఆ కారణంగా విభేదాలు పొడసూపి పార్టీని వీడిన విశే్వశ్వర్‌రెడ్డి ఇప్పుడు పార్టీని తూలనాడటం సరైంది కాదన్నారు. విశే్వశ్వర్‌రెడ్డి తన ప్రధాన అనుచరులైన కనకయ్య, పైలట్ రోహిత్‌రెడ్డి, కేఎస్ రత్నంను ముందుగానే మహాకూటమిలోకి పంపి, తరువాత కుట్ర పూరితంగా పార్టీపై దుశ్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. 23న మహబూబాబాద్‌కు సీఎం కేసీఆర్ వస్తున్నారని, ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారని, ఈ సభకు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరా రు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు మాచెర్ల రమేష్, ఆత్మ చైర్మెన్ పోలెపల్లి నెహ్రురెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండల కన్వీనర్ దామెరకొండ ప్రవీన్‌కుమార్, రాష్ట్ర నాయకుడు బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ సురేందర్, యాకూబ్‌రెడ్డి, రంగారావు తదితరులు పాల్గొన్నారు.