వరంగల్

మరోసారి విజయం నాదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 8: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి మూడవ సారి తన హాట్రిక్ విజయం ఖాయం అని టీఆర్‌ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం హన్మకొండలోని టీఆర్‌ఎస్ అర్బన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ సరళి టీఆర్‌ఎస్‌కు పూర్తిగా అనుకూలంగా ఉందని, కేసీఆర్ చెప్పినట్లుగా వందకు పైగా సీటు గెలుచుకుని రెండవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని ఆయన అన్నారు. ఎగ్జిట్ ఫోల్స్ ఎన్ని వచ్చిన విజయం టీఆర్‌ఎస్‌దేనని అన్నారు. ఓటరు జాబితాలో తప్పు దొర్లిన మాట వాస్తవమేనని, దీంతో అర్బన్‌లో పోలింగ్ శాతం తగ్గిందన్నారు. 58.02 శాతం నమోదు అయిందని తెలిపారు. ఓటమి భయంతో మహాకూటమి నాయకలు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిపారని ఎలాంటి సంఘటనలు దురదృష్టకరమన్నారు. గతంలో మాదిరిగానే నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం ప్రజలతో ముఖముఖి, అపార్టుమెంట్ దర్శన్ ఎదవిదిగా కొనసాగిస్తానని అన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. తన విజయం కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజా కూటమి అధికారంలోకి రావడం కల అని అన్నారు. ఎన్ని కూటములు కట్టిన ప్రజలు కేసీఆర్ పక్షానే నిలిచారని తెలిపారు. సమావేశంలో కూడ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, బొర్ర ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎంల వద్ద భద్రత పటిష్టం
భూపాలపల్లి, డిసెంబర్ 8: ఎన్నికలు పూర్తయి ఈవీఎంలు జిల్లా కేంద్రానికి చేరడంతో అధికారులంతా కౌంటింగ్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భూపాలపల్లి నియోజక వర్గానికి చెందిన ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ మినీ స్టేడియంలో భద్రపరచగా ములుగు నియోజక వర్గానికి సంబంధించిన ఈవీఎంలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూంల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు నియోజకవర్గాలలో 572 పోలింగ్ కేంద్రాలు ఉండగా భూపాలపల్లికి చెందిన 299 ఈ వి ఎంలు, ములుగు నియోజక వర్గానికి చెందిన 277 ఈవీఎంలను రెండు చోట్ల ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. 11న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ కోసం అధికారులు 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 21 రౌండ్లలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం అవకాశం ఉంటుంది.