వరంగల్

అన్నా మీ దగ్గర ఎట్లున్నదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, డిసెంబర్ 8 : ఎన్నికలు పూర్తి కావడంతో ఇక ఫలితాలపై అందరి దృష్టి పడింది. ఎక్కడ నలుగురు గుమికూడినా అన్నా మీ దగ్గర ఎట్లున్నదే.. అనే మాట ప్రతి చోట వినిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికలు హోరా హోరీ జరగడంతో అందరు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు శుక్రవారం జరిగిన ఎన్నికల సరళిపై గ్రామాల వారిగా ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నా రు. ఏ మండలాల్లో తమకు అనుకూలంగా ఉందో, ఏయే మండలాల్లో తక్కువ ఓట్లు నమోదయ్యాయో ఆరా తీసే పనిలో పడ్డారు. గ్రామాల వారిగా, మండలాల వారిగా కూడా ఎన్నికల సరళిని సమీక్షిస్తున్నారు. ఎన్నికల రోజున జరిగిన లోపాలపై కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. తమకు ప్రతికూల పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి తమ గెలుపును ప్రభావితం చేస్తాయా లేదా అనే దానిపై ఆయా మండలాల నేతలతో సమీక్షిస్తున్నారు. ఈ సారి జరిగిన ఎన్నికల్లో గెలుపోటములను బేరిజు వేయడంలో కొంత సందిగ్దత నెలకొంది. కాంగ్రెస్ నుండి గండ్ర రమణారెడ్డి, టీఆర్‌ఎస్ నుండి సిరికొండ మధుసూదనాచారి, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి గండ్ర సత్యనారాయణరావులు బరిలో ఉండగా బీజేపీ నుండి చందుపట్ల కీర్తిరెడ్డి పోటీలో ఉన్నారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో త్రిముఖ పోటీ మాత్రమే ఉన్నట్లు కనిపించింది. ముగ్గురి మధ్య హోరా హోరి పోటీ ఉంటుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ విన్నా అభ్యర్థుల గెలుపోటములపైనే తీవ్ర చర్చ జరుగుతోంది. మావాడే గెలుస్తాడంటే మావాడే గెలుస్తాడని నాయకులు శపదాలు కూడా చేస్తున్నారు. మరో 48 గంటల పాటు ఉత్కంఠ కొనసాగనుంది. అభ్యర్థుల్లో కూడా గెలుపోటముల భయం వెంటాడుతోంది.