వరంగల్

అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలో భద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 8: పోలింగ్ తంతు ప్రశాంతంగా ముగియడంతో ఇక అందరి దృష్టి ఫలితాలపై పడింది. అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో దాగి ఉంది. పోలింగ్ ప్రక్రియ ముగియగానే కౌటింగ్ ముందుగా ఏర్పాటు చేసిన వరంగల్ ఏనుమాముల మార్కెట్లో స్ట్రాంగ్‌రూంలో భద్ర పరిచేందుకు శనివారం ఉదయం భారీ బందోబస్తు మధ్య తరలించారు. స్ట్రాంగ్ రూంలో భద్ర పరిచిన ఈవీ ఎంలను వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. 11న కౌటింగ్ ఉండడంతో అందుకు సంబంధించన ఏర్పాట్లను కూడా కలెక్టర్ పర్యవేక్షించారు. వరంగల్ తూర్పు నియోజక వర్గానికి సంబంధించిన 215 పోలింగ్ కేంద్రాల పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ సమాగ్రితో సెక్టోరియల్ అధికారుల పర్యవేక్షణలో పోలీస్ ఎస్కార్డ్‌తో ఏనుమాముల మార్కెట్ యార్డు గోదాములకు తరలించారు. ఈవీఎంలు నెంబర్ 03లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి చేరుకున్నాయని అన్నారు. ఈవీఎంలు, ప్రిసైడింగ్ అధికారి టూర్ డైరీ, ఇతర చట్టబద్ద పత్రాలు క్షుణంగా పరిశీలించి, అనంతరం పోలీసుల రక్షణలో ఏనుమాముల మార్కెట్ గోదామ్‌లోని ఎమ్మెల్యే పాయింట్ నెంబర్ 03 ఏ నందు లెక్కింపు కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలోకి తరలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ వేశారు. స్ట్రాంగ్ రూం వద్ద సీసీ కెమెరాలతో పాటు పటిష్ట రక్షణ ఉంటుందని వరంగల్ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పీవీ గౌతమ్ తెలిపారు. 11న ఓట్ల లెక్కింపు చేపట్టుట జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ వెంకట్ రెడ్డి, ఏసీపీ నర్సయ్య, వరంగల్, ఖిలా వరంగల్ తహశీల్ధార్లు రాజేశ్, కిరణ్‌కుమార్, నాయబ్ తహశీల్ధార్లు శ్రీపాల్, ఇక్బాల్, రియాజ్ అహ్మద్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున బూత ముత్తిలింగం, తెలంగాణ రాష్ట్ర సమితి తరుపున వల్ది చక్రధర్, స్వతంత్య్ర అభ్యర్ధులు గోరంటాల శరత్‌బాబు, పాలడుగుల సురేందర్, బల్దియా డీఈలు సంజయ్, రవీందర్, వర్క్ ఇన్స్‌పెక్టర్ హరికుమార్, రెవెన్యూ సిబ్బంది రజినికాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.