వరంగల్

అడిగిన ప్రతి అన్నదాతకు విద్యుత్ పంప్‌సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, డిసెంబర్ 14: నర్సంపే ట నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. నర్సంపేటలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. నర్సంపేట అభివృద్ది గత 18 ఏళ్లుగా వెనక్కి నెట్టివేయబడిందని అన్నారు. నర్సంపేటలో గెలిచిన శాసనసభ్యుడు ఒకరు ఉంటే రాష్ట్రంలో అధికారంలో మరో పార్టీకి చెందిన ప్రభుత్వం ఉండేదని చెప్పారు. అయితే ఈసారి ప్రజలు విస్పష్టంగా తీర్పు ఇచ్చారని, రాజకీయాలకతీతంగా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని వెల్లడించారు. గత ఎన్నికల ముందు అనేక పథకాలకు సంబంధించిన జీఓలను తీసుకవచ్చి, నిధుల ను సైతం మంజూరు చేయించానని, కొంత మంది అభివృద్ది నిరోధకుల వల్ల ఆపనులు నిలిచిపోయాయని అన్నారు. నియోజకవర్గంలోని లక్షా నలబై వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తగిన ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలిపారు. పాఖాల, రంగయ్య చెరువు ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. మరికొద్ది రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానుందని, స్థానికంలో తెరాస విజయం ఏకపక్షంగా వచ్చేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నాయకులు మునిగాల వెంకట్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, కామగోని శ్రీనివాస్, కిషన్, దార్ల రమాదేవి, ఎంవీ.రామారావు, పుట్టపాక కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
* విద్యుత్ పంప్‌సెట్లు పంపిణీ
నర్సంపేట నియోజకవర్గానికి పైలెట్ ప్రాజెక్టు కింద రూ.9 కోట్లు తీసుకవచ్చి, 7 వేల పైచీలుకు విద్యుత్ పంప్‌సెట్లను మంజూరు చేయించానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వెల్లడించా రు. నర్సంపేటలో శుక్రవారం రైతులకు సబ్సీడీ మోటార్లను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈసందర్భం గా పెద్ది మాట్లాడుతూ తన చేతుల మీదుగా రైతులకు యాబై శాతం సబ్సీ డీ మోటార్లను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. అడిగిన ప్రతి రైతుకు సబ్సీడీ మోటార్లను అందజేస్తామని, తొలి ప్రాధాన్యతలో దళిత, గిరిజన రైతులకు ఇవ్వనున్నట్లు చెప్పా రు. ఈకార్యక్రమంలో రైతు సమన్వయ సమితి డైరెక్టర్ రాయిడి రవీందర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీఏ ఉషాదయళ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, ఏడీఏ శ్రీనివాసరావు, మార్కె ట్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.

సామాజిక మాద్యమాలతో జరభద్రం
వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ పిలుపు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, డిసెంబర్ 14: ప్రస్తుతం అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల వినియోగంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉం టుందని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తం గా ఉన్న సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవడంతో పాటు ఇతరులతో పంచుకోవడం కోసం రూపొందించిన మాధ్యమాల వినియోగం పట్ల ప్రజల ను అప్రమత్తం చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం ప్రకట న విడుదల చేశారు. ముఖ్యంగా మహళలు, యువతలు, విద్యార్ధునిలను వేధింపులకు గురిచేయడమే తమ లక్ష్యంగా నేరగాళ్లు తమ కార్యకలపాలను కోనసాగిస్తున్నారు. ఇలాంటి సైబ ర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజల ను అప్రమత్తం చేయడంతో పాటు వారి కార్యకలపాలను నియంత్రణ, నింధితులను గుర్తించి వారిని అరెస్ట్ చేయడంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం విభాగం చాలా చురుకుగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సామాజిక మాధ్యమాల ద్వారా చట్టవ్యతిరేక కార్యాకలపాలతో పాటు మహిళలను, వ్యాపారస్థులపై వేధింపులకు గురిచేస్తూనట్లుగా నమోదుయిన కేసులోని నిందితులను గుర్తించడంతో పాటు వారిని అరెస్ట్ చేసి జైలుకు సైతం పంపడంతో పాటు, ప్రపంచంలోని ప్రస్తుతం అందుబాటులో ఉన్న 26 వేల రకాల సెల్‌ఫోన్ల తో పాటు ఏ విధమైన హార్డ్‌డిస్క్‌లలో తొలగించిన సమాచారాన్ని పూర్తిగా తిరిగి రాబట్టడం, ధర్యాప్తులో భాగం గా పోలీసులు సేకరించిన సీసీ కెమెరాల దృశ్యల్లో సరిగా కనిపించడని దృష్యాల నుండి కేసు సంబంధించిన స్యాక్ష్యాలను సేకరించడం కోసం ప్రత్యేకమైన అధునిక వ్యవస్థను ఈ సైబర్ విభాగంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 62 కేసులు నమోదు కాబడ్డాయి. ఇందు లో అత్యధికంగా సెంట్రల్ జోన్ పరిధిలో 36 కేసులు నమోదు కాగా, వెస్ట్‌జోన్ పరిధిలో 14, ఈస్ట్‌జోన్ పరిధిలో 12 కేసులు నమోదు కాబడ్డాయి. అత్యధికంగా సెంట్రల్ జోన పరిధిలో 36 కేసులు నమోదు కాగా, వెస్ట్‌జోన్ పరిధిలో 14, ఈస్ట్‌జోన్ పరిధిలో 12 కేసు లు నమోదు కావడం జరిగింది. వాట్సప్, ఫెస్‌బుక్‌ల ద్వారా మహిళలు, యువతల పరువుకు భంగం కలిగించి న కేసులు నమోదుకాగా, మొబైల్ కాల్స్, ఇంటర్‌నెట్ ఫోన్ కాల్స్ ద్వారా మహిళలను వేధించడం లాంటి కేసులతో పాటు, బ్యాంకుల పేరుతో ఖాతాదారుల ఖాతా నుండి సోమ్మును కాజేసి నింధితులు, ఆన్‌లైన్ జాబ్స్, లాటరీ మోసాలకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో పాటు వీటిలో చాల వరకు సైబర్ విభాగం పోలీసులతో పాటు స్థానిక పోలీసుల సదరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడం జరిగిందిని తెలిపారు.

సమష్టి కృషితోనే
ఎన్నికలు విజయవంతం
జిల్లా పోలీసులను అభినందించిన ఎస్పీ భాస్కరన్
భూపాలపల్లి, డిసెంబర్14: అసెంబ్లీ ఎన్నికలు సమిష్టి కృషితోనే విజయవంతం అయ్యాయని ఎస్పీ ఆర్ భాస్కరన్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసులు, అధికారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖాముఖి మాట్లాడుతూ జయశంకర్ జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నప్పటికి సంయమనంతో అధికారులు, పోలీసులు పని చేశారని ప్రశంసించారు. సివిల్ పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ, ఏఆర్ పోలీసులు ఎంతో సహనంతో ఎన్నికల్లో పని చేయడం, రాష్ట్రంలో జిల్లా పోలీసులకు మంచి గుర్తింపు లభించిందన్నారు. జిల్లాకు జాతీయ నాయకులు వచ్చినప్పటికి ఎంతో ఓర్పుతో బందోబస్తు నిర్వహించారని, అందరి సేవలను గుర్తించామన్నారు. కష్టపడి పనిచేసిన వారి పేర్ల జాబితాను పంపిస్తే వారికి బహుమతులు అందజేస్తామన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన పోలీసు అధికారులను ఆయన ఈ సందర్బంగా అభినందించారు. ఇదే స్పూర్తితో రాబోయే రోజుల్లో పనిచేసి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బానోత్ రాజమహేంద్రనాయక్, ఓఎస్‌డి సురేష్ కుమార్, సయ్యద్ బాషా, ములుగు డీఎస్పీ విజయ సారథి పాల్గొన్నారు.