వరంగల్

షెత్వార్, పహాణీల ప్రకారం చెరువులకు బఫర్ జోన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 11: చెరువుల పరిరక్షణకు చర్య లు చేపట్టాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శుక్రవారం ‘కుడా’ సమావేశ మందిరంలో జరిగిన చెరువుల రక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ చెరువులు ఆక్రమణలకు గురై ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. రెవెన్యూ, నీటి పారుదల, కుడా, బల్ది యా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. చెరువులకు షెత్వార్, పహాణీల ప్రకారం సర్వే చేసి బఫర్ జోన్ నిర్ధారించాలని అన్నారు. బఫర్ జోన్లో మంజూరు చేసిన ఇండ్ల పట్టాలను రద్దు చేసి బలహీన వర్గాలకు చెందిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలన్నారు. చెరువుల ఆక్రమణ తొలగింపుపై చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులకు సంబంధించి, సాగుకు చెరువుల ఆక్రమణల తొలగింపుపై చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులకు సంబంధిం చి సాగుకు నోటిపై అయిందా, అయితే ఎంత ఆయకట్టు, నీటి విస్తరణ వైశాల్యం ఎంత ఎప్టీ ఎల్ నిర్దారణ జరిగిందా, జరిగితే ఏ స్ధాయి వరకు త్రాగు నీటికి నోటిపై అయిందా, బఫర్ జోన్ ఎక్కడ వరకు ఫీడర్ ఛానల్ ఉందా, ఎంత మేర ఉంది తదితర సమగ్ర వివరాలను నివేదక సిద్దం చేయాలన్నారు.

జీపీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి
-ఆర్డీవో వెంకటాచారి
భూపాలపల్లి, జనవరి 11: గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని భూపాలపల్లి ఆర్డీవో వెంకటాచారి గ్రామ పంచాయతీ ఎన్నికల స్టేజి -1, స్టేజీ -2 రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సింగరేణి క్లబ్ హౌజ్‌లో భూపాలపల్లి డివిజన్ గ్రామపంచాయతీ ఎన్నికల స్టేజి వన్, స్టేజి టూ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన భూపాలపల్లి ఆర్‌డీఓ స్టేజి వన్, స్టేజి టు రిటర్నింగ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు మీరే కర్త, కర్మ, క్రియలని మీరు సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తేనే ఎన్నికలు విజయవంతమవుతాయని, ఈ రోజు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని శ్రద్ధగా విని గ్రామపంచాయతీ ఎన్నికల నియమావళిని క్షుణ్ణంగా తెలుసుకొని విధులు నిర్వహించాలన్నారు. శాసనసభ ఎన్నికలలో ఆర్డీవో నిర్వహించిన పాత్రను జిపి ఎన్నికలలో మీరు నిర్వహించాల్సి ఉన్నందున ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండి ఎన్నికల నిబంధనల మేరకు పని చేయాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను సమర్ధవంతంగా అమలు చేయాలని అన్నారు. స్టేజి వన్ రిటర్నింగ్ అధికారులు నామినేషన్‌ల స్వీకరణ నుండి అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు వరకు అన్ని ఎన్నికల నిబంధనల మేరకు సరి చూసుకొని నామినేషన్ పత్రాలను స్వీకరించి స్క్రూటీని చేసి ఫైనల్ జాబితా సిద్ధం చేసి గుర్తులను కేటాయించాలని అన్నారు. అలాగే స్టేజి టు రిటర్నింగ్ అధికారులు ఓటరు స్టిప్‌ల పంపిణీ, ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను మొదలుకొని ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు, గెలిచిన వారికి ధృవీకరణ పత్రాలు అందించడం, ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం, జిల్లా ఎన్నికల అధికారికి రిపోర్ట్‌లను అందించడం వరకు పూర్తిగా నిబంధనల మేరకు సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు, మాస్టర్ ట్రైనీలు తదితరులు పాల్గొన్నారు.
రాష్టస్థ్రాయి వైజ్ఞానిక ప్రదర్శనకు
నర్సంపేట విద్యార్థులు ఎంపిక
నర్సంపేట, జనవరి 11 : రాష్టస్థ్రాయి వైజ్ఞానిక ప్రదర్శనకు మదర్స్‌ల్యాండ్ విద్యార్ధులు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ మధు తెలిపా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ధన్నపేటలో గత 3 రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ మనక్ వైజ్ఞానిక ప్రదర్శనలో మా విద్యార్థులు ఎగ్జిబిట్లు ప్రదర్శించి అత్యుత్తమ ప్రతిభ చూపించి రాష్టస్థ్రాయిలో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైనట్లు తెలిపారు. సాయిమోహన్ ప్రదర్శించిన ఎగ్జిబిట్ రాష్టస్థ్రాయికి ఎంపికైనట్లు తెలిపా రు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమేష్, అకాడమిక్ ప్రిన్సిపాల్ భాస్కర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

యాసంగి లోగా 132 కేవీ విద్యుత్ స్టేషన్ పనులు పూర్తిచేయాలి
-ఎన్‌పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు
వెంకటాపురం (నూగూరు), జనవరి 11: యాసంగి లోగా 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను పూర్తి చేసి ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని గ్రామాలకు మెరుగైన విద్యుత్ సౌకర్యం కల్పించాలని, పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలకేంద్రంలోని వెంకటాపురంలో 132/33 విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనుల ప్రగతిని ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటాపురానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న గోదావరి నదిలోని విద్యుత్ టవర్ల నిర్మాణ ప్రగతిని సీఎండీ ఉన్నతాధికారులతో పిల్లర్స్‌లు పరిశీలించారు. గోదావరిలో మొత్తం ఆరు పిల్లర్స్ నిర్మాణం చేపట్టారు. గోదావరి ఆవల ఒడ్డు అయిన మంగపేట, కమలాపురం రేయన్స్ ఫ్యాక్టరీ సమీపం నుండి విద్యుత్ లైన్లు గోదావరి దాటించి వెంకటాపురంలో సబ్‌స్టేషన్‌కు కలెక్షన్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా గోదావరిలో ఆరు బారీ పిల్లర్సు నిర్మాణాన్ని చేపట్టారు. భారీ యంత్రాలతో నిర్మాణాలు చేపట్టే రహదారిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరు పిల్లర్సులో రెండు గ్రౌండ్ స్థాయి దాటి మరో నాలుగు పిల్లర్సు నిర్మాణ దశలో ఉండటాన్ని ఆయన పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో రెండెకరాలకు పైగా విస్తీర్ణంలో చేపట్టిన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను, వివిధ విభాగాలను నిర్మాణానికి వినియోగించే మెటీరియల్స్‌ను ఆయన పరిశీలించారు. భద్రాచలం సమీపంలోని ఎటపాక నుండి గోదావరి పరివాహక ప్రాంతం అటవీగుండా వెంకటాపురం వాజేడు మండలాలకు ప్రస్తుతం విద్యుత్ సరఫరా అవుతుందని, ప్రకృతి వైపరిత్యాల కారణంగా వంద కిలో మీటర్లకు పైగా ఉన్న విద్యుత్ లైను ఇబ్బందులకు గురవుతుందని, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రైతాంగానికి నిరంతర విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా బూస్టర్స్ ఏర్పాటు చేయడం పట్ల వెంకటాపురం, వాజేడుమండలాలకు చెందిన రైతులు సీ ఎండీకి కృతజ్ఞతలు తెలియజేశారు. మండలకేంద్రంలోని 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ మరమ్మతులు, పెయింటింగ్‌లను పరిశీలించారు. సీఎండీ వెంట ట్రాన్స్‌కో డైరెక్టర్ జగతి రెడ్డి, ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ మోహన్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్ సంపత్‌కుమార్, డీఈ భాస్కర్, ఏడీఈ మనోహర్, వెంకటాపురం ఏడీఈ బెనర్జీ పలువురు విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.

చకచక జరుగుతున్న రామరావు పార్కు పనులు
హంటర్‌రోడ్. జనవరి 11: బల్దియా అభివృద్ధి పనులలో భాగంగా హంటర్‌రోడ్ హన్మకొండ రామారావు కాలనీలో నిర్మాణంలో ఉన్న పార్కు అభివృద్ది పనులు చకచక జరుగుతున్నాయి. ఈ పార్కుకు మే 13,2016 సంవత్సరంలో పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ శంఖుస్ధాపన చేయగా పార్కు అభివృద్ధి పనులు గత కొన్ని రోజులుగా నత్తనడకకన సాగాయి. మళ్లి అంసెబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పనులలో వేగం పెంచింది బల్దియా నగరంలో అన్ని చోట్ల అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా రామారావు పార్కు పనులు పూర్తి కావచ్చాయని అధికారులు తెలిపారు.